Car AC: వేసవి కాలంలో ఏసీ లేకుండా కారులో కూర్చోవడం చాలా కష్టంగా ఉంటుంది. కారు ఎక్కువ సేపు ఎండలో నిలిచి ఉంటే మొత్తం క్యాబిన్ చాలా వేడిగా మారి కారులో కూర్చోవడం కూడా కష్టమవుతుంది. క్యాబిన్ చల్లగా ఉంటే కారులో కూర్చోవడం ఒక ప్రత్యేక ఆనందాన్ని ఇస్తుంది. అలాంటి సమయంలో ఏసీ (Car AC) చాలా అవసరం. కారు ఏసీ సరిగ్గా ఉంటే కొన్ని నిమిషాల్లోనే క్యాబిన్‌ను చల్లగా చేస్తుంది. కొన్నిసార్లు ఏసీ సరిగ్గా పని చేయకపోవచ్చు. దీని వల్ల వేసవిలో కారులో ప్రయాణం చేయడం కష్టంగా మారుతుంది. ఏసీ పని చేయకపోవడానికి కారణాలు ఏమిటి? దాన్ని ఎలా సరిచేయవచ్చో? ఇప్పుడు తెలుసుకుందాం.
అసాధారణ శబ్దాలు ఈ సంకేతాలను ఇస్తాయి
ఏసీ సరిగ్గా పని చేయకపోతే ముందుగా ఈ లోపాన్ని కనుగొనడానికి ఏసీని పూర్తి వేగంతో ఆన్ చేయండి. ఆ తర్వాత ఏసీ ఎయిర్ వెంట్ వద్ద చెవిని ఉంచి వినండి. ఏదైనా అసాధారణ శబ్దం వస్తుంటే అది కంప్రెసర్ సరిగ్గా పని చేయకపోవడాన్ని సూచిస్తుంది. దీనికి కారణం క్లచ్ దెబ్బతినడం లేదా కంప్రెసర్‌ను స్థిరంగా ఉంచే స్క్రూలు సడలిపోవడం కావచ్చు. ఒకవేళ ఏసీ వేడి గాలిని ఇస్తుంటే అది లీక్ అవుతున్నట్లు సంకేతం.
Also Read: Vasthu Tips: ఏంటి ఇంట్లో నిద్రపోవడానికి, వాస్తుకి సంబంధం ఉందా? ఆ దిక్కులో పడుకోకూడదా?
ఎయిర్ ఫ్లో ఆగిపోవడానికి కారణాలు
కారు ఏసీ వెంట్ నుంచి ఎయిర్ ఫ్లో సరిగ్గా రాకపోతే బ్లోవర్ మోటార్‌లో ఏదో లోపం ఉండవచ్చు. హై స్పీడ్‌లో ఆన్ చేసిన తర్వాత కూడా ఎయిర్ ఫ్లో తక్కువగా ఉంటే ఎయిర్ ఫిల్టర్‌లో ధూళి పేరుకుపోయి ఉండవచ్చు. అలాగే వెంట్ నుంచి వచ్చే గాలిని వాసన చూడండి. ఒకవేళ అసాధారణ వాసన వస్తుంటే అది రేడియేటర్ ద్రవంలో లీకేజ్ ఉన్నట్లు సూచిస్తుంది. క్యాబిన్ ఎయిర్ ఫిల్టర్‌లో లోపం కారణంగా కూడా ఇలా జరగవచ్చు.
సర్వీస్ సెంటర్‌కు ఎప్పుడు తీసుకెళ్లాలి?
ఏసీ సిస్టమ్ కంప్రెసర్‌ను తిప్పడానికి, శక్తిని అందించడానికి బెల్ట్ ఉంటుంది. ఒకవేళ అది సరైన దిశలో లేకపోతే లేదా దెబ్బతిని ఉంటేచఅది పుల్లీ నుంచి జారిపోతుంది. దీనివల్ల ఏసీ సరిగ్గా పని చేయదు. మల్టీమీటర్‌లో ఉన్న ఏసీ ఫ్యూజ్ ఎగిరిపోయిన కారణంగా కూడా ఇది పని చేయకపోవచ్చు. ఏసీ లైన్‌లు గడ్డకట్టడం వల్ల కూడా క్యాబిన్‌ను చల్లగా చేయలేదు. అలాంటి సందర్భాల్లో సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లమని సలహా.