Hyundai i10: హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 సరికొత్త ఎడిషన్…అదిరిపోయే లుక్ తో అప్ డెటెడ్ ఫీచర్స్..!!

ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజ సంస్థ హ్యుందాయ్ ఇండియా గ్రాండ్ ఐ10 నియోస్ కార్పొరేట్ ఎడిషన్ ని విడుదల చేసింది.

  • Written By:
  • Publish Date - May 25, 2022 / 06:45 AM IST

ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజ సంస్థ హ్యుందాయ్ ఇండియా గ్రాండ్ ఐ10 నియోస్ కార్పొరేట్ ఎడిషన్ ని విడుదల చేసింది. గ్రాండ్ ఐ10 నియోస్ హ్యాచ్ బ్యాక్ స్పెషల్ ఎడిషన్ మాన్యువల్ ఇంకా ఏ ఎంటి గేర్ బాక్స్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉండనుంది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కార్పొరేట్ ఎడిషన్ ద్వారా టెక్నాలజీ మెరుగుదలలతో స్పోర్టీ అండ్ ఆకర్షణీయంగా కనిపించేలా కారును అందించడానికి ప్రయత్నించిందని వాహన తయారీదారు సంస్థ వెల్లడించింది.

ధర…
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కార్పొరేట్ ఎడిషన్ ధర రూ. 6,28,900నుంచి 6,97,700వరకు ఉంటుంది. ఈ కారు 1.2లీటర్ కప్పా పెట్రోల్ ఇంజన్ తో వస్తుంది. స్టాండర్డ్ మోడల్ తో పోలిస్తే…గ్రాండ్ ఐ10 నియోస్ కార్పొరేట్ ఎడిషన్ ఎన్నో టెక్నాలజీ ఆప్ డేట్స్ తో వస్తుందని సంస్థ పేర్కొంది.

డిజైన్ …
మాగ్నా ట్రిమ్ ఆధారంగా రూపొందించారు. ఇంకా ఎన్నో ఎక్ట్సీరియర్ అండ్ ఇంటర్నల్ అప్ డేట్స్ పొందుతుంది. కొత్త గ్రాండ్ ఐ10 నియోస్ కార్పొరేట్ ఎడిషన్ లో గ్లోసీ బ్లాక్ రేడియేటర్ గ్రిల్, 15 అంగుళాల గన్ మెటల్ స్టైల్ వీట్స్ , రూఫ్ రెయిల్స్ , రియర్ క్రోమ్ గార్నిషింగ్, కార్పొరేట్ ఎంబ్లమ్, బ్లాక్ పెయింటెడ్ ఓఆర్శీఎంలు వంటి ఎన్నో ఎక్స్టీరియర్ మార్పులు ఉన్నాయని సంస్థ తెలిపింది.

ఫీచర్లు…
క్యాబిన్ లోపలు లేటెస్టు ఫీచర్లు అప్ డేట్ చేయబడ్డాయి. స్మార్ట్ ఫోన్ మిర్రరింగ్ ద్వారా నావిగేషన్ 6.75 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, ఫ్రంట్ మిర్రర్స్ పై ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్స్ తో కూడిన ఎలక్ట్రిక్ ఫోల్డింగ్ ఓఆర్వీఎం వంటి స్టాండర్డ్ ఫీచర్స్ పొందుతుంది.