Site icon HashtagU Telugu

Hero Sales: ఈ బైక్‌ను తెగ కొనేస్తున్నారుగా.. నెల‌లోనే 3 ల‌క్ష‌ల‌కు పైగా కొనేశారు!

Hero Sales

Hero Sales

Hero Sales: బైక్‌పై రోజూ దూర ప్రయాణాలు చేసే వారికి 100సీసీ బైక్‌లు అత్యంత ప్రాచుర్యం పొందాయి. తక్కువ ధర, నిర్వహణ ఖర్చు, మంచి మైలేజీ కారణంగా ఈ బైక్‌లు మార్కెట్‌లో భారీగా అమ్ముడవుతున్నాయి. ఈ విభాగంలో హీరో స్ప్లెండర్ ప్లస్ ప్రస్తుతం అత్యధిక అమ్మకాలతో (Hero Sales) రికార్డులు సృష్టిస్తోంది.

అమ్మకాలలో అగ్రస్థానం

హీరో స్ప్లెండర్ ప్లస్ అమ్మకాలు నెలనెలా పెరుగుతున్నాయి. జూన్ 2025లో ఈ బైక్ ఏకంగా 3,31,057 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత సంవత్సరం జూన్ 2024లో 3,05,586 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంటే ఈసారి 25,471 యూనిట్లు అదనంగా విక్రయించబడ్డాయి. ఈ గణాంకాల ప్రకారం.. స్ప్లెండర్ ప్లస్ 8.34% YoY వృద్ధిని సాధించింది. ప్రస్తుతం మార్కెట్‌లో 63.13% వాటాతో ఈ బైక్ అగ్రస్థానంలో కొనసాగుతోంది.

Also Read: Labor Ministry: ఐటీ దిగ్గజ సంస్థ టీసీఎస్‌కు భారీ షాక్‌.. వివ‌ర‌ణ ఇవ్వాల‌ని కోరిన కేంద్రం!

ఇంజన్- మైలేజీ

స్ప్లెండర్ ప్లస్‌లో 97.2సీసీ సింగిల్-సిలిండర్ ఇంజన్ ఉంది. ఇది 7.9 బీహెచ్‌పీ పవర్, 8.05 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో అనుసంధానించబడింది. దీనిలోని ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీ కారణంగా ఇంజన్ పనితీరు మెరుగ్గా ఉంటుంది. ఈ బైక్ ఒక లీటరు పెట్రోల్‌కు 73 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తుందని నివేదికలు సూచిస్తున్నాయి. భద్రత కోసం ముందు, వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి. ఈ బైక్ ధ‌ర రూ. 80 వేల నుంచి అందుబాటులో ఉన్నాయి.

అధునాతన ఫీచర్లు

స్ప్లెండర్ ప్లస్ సాధారణ వెర్షన్‌తో పాటు X-Tech వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. ఈ వేరియంట్‌లో అనేక ఆధునిక ఫీచర్లు ఉన్నాయి.

డిజిటల్ స్పీడోమీటర్: ఇందులో రియల్-టైమ్ మైలేజీ, బ్లూటూత్ కనెక్టివిటీ, కాల్స్, ఎస్‌ఎంఎస్, బ్యాటరీ అలర్ట్స్ వంటి సమాచారం లభిస్తుంది.

యూఎస్‌బీ పోర్ట్: ప్రయాణంలో మొబైల్ ఫోన్‌ను ఛార్జ్ చేసుకోవడానికి ఈ పోర్ట్ సౌకర్యం ఉంది.

ఈ అప్‌డేటెడ్ ఫీచర్ల వల్ల బైక్ మరింత ఆకర్షణీయంగా మారింది. తక్కువ ధర, మెరుగైన మైలేజీ, ఆధునిక ఫీచర్ల కలయికతో స్ప్లెండర్ ప్లస్ మార్కెట్‌లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.