Vehicle Prices: పండుగల సీజన్‌కు ముందు రెనాల్ట్ ఇండియా తమ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. జీఎస్టీ 2.0 తగ్గింపు ప్రయోజనాలను పూర్తి స్థాయిలో కస్టమర్లకు బదిలీ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. దీంతో ఇప్పుడు రెనాల్ట్ కార్లు మరింత తక్కువ ధరకే (Vehicle Prices) లభించనున్నాయి. కంపెనీ తన కార్ల ధరలను రూ. 96,000 వరకు తగ్గించినట్లు తెలిపింది.
రెనాల్ట్ ట్రైబర్: ధరలు తగ్గాక మరింత చౌక
జీఎస్టీ తగ్గింపుతో దేశంలోనే అత్యంత చౌకైన 7-సీటర్ కారుగా పేరు పొందిన రెనాల్ట్ ట్రైబర్ ధర కూడా తగ్గింది. ఈ కారు ఇప్పుడు మరింత సరసమైన ధరలో లభ్యం కానుంది. రెనాల్ట్ ప్రకారం.. ట్రైబర్ అన్ని వేరియంట్ల ధరలు దాదాపు 8.5% వరకు తగ్గాయి. ముఖ్యంగా పెట్రోల్-ఆటోమేటిక్ వేరియంట్‌ను కొనుగోలు చేసే వారికి రూ. 78,195 వరకు ప్రయోజనం లభిస్తుంది. రెనాల్ట్ ట్రైబర్ 7-సీటర్ కారు అయినప్పటికీ ఇది కాంపాక్ట్ సైజులో లభిస్తుంది. ఇది నగరం, హైవే రెండు చోట్లా డ్రైవింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. సీట్లు ఫోల్డ్ చేసిన తర్వాత 625 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది.
Also Read: Rohit Sharma: ఆసియా కప్ మ్యాచ్‌కు ముందు రోహిత్ శర్మ షాకింగ్ పోస్ట్!
రెనాల్ట్ ట్రైబర్ ఫీచర్లు
కొత్త రెనాల్ట్ ట్రైబర్ ఇంటీరియర్‌లో కూడా అనేక మార్పులు చేశారు. ఇది డ్యూయల్-టోన్ థీమ్, మెరుగైన నాణ్యత గల మెటీరియల్ ఫినిషింగ్, కొన్ని అధునాతన ఫీచర్లను కలిగి ఉంది. కొత్త ట్రైబర్‌లో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉంటాయని భావిస్తున్నారు.
మెకానికల్ సెటప్‌లో మార్పు లేదు
రెనాల్ట్ ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్ మెకానికల్ సెటప్‌లో పెద్దగా మార్పులు ఉండవు. ఇందులో ఇప్పటివరకు ఉన్న 1.0-లీటర్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ యథాతథంగా కొనసాగుతుంది. ఈ ఇంజిన్ దాదాపు 72 బీహెచ్‌పి పవర్, 96 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. గేర్‌బాక్స్ ఎంపికలో 5-స్పీడ్ మాన్యువల్, ఏఎమ్‌టి ట్రాన్స్‌మిషన్ అందుబాటులో ఉంటాయి. బడ్జెట్ ధరలో మంచి 7-సీటర్ కారు కోసం చూస్తున్న కస్టమర్లకు ఇది ఒక మంచి ఎంపిక.