KTR – Electric Truck : ‘ఎలక్ట్రిక్ ట్రక్కు నెక్ట్స్ లెవెల్’.. కేటీఆర్ వీడియో ట్వీట్ వైరల్

KTR - Electric Truck : బీఆర్ఎస్ అగ్రనేత, మాజీ మంత్రి కేటీఆర్ చేసిన ఒక ట్వీట్ వైరల్ అవుతోంది.

Published By: HashtagU Telugu Desk
Ktr Electric Truck

Ktr Electric Truck

 

KTR – Electric Truck : బీఆర్ఎస్ అగ్రనేత, మాజీ మంత్రి కేటీఆర్ చేసిన ఒక ట్వీట్ వైరల్ అవుతోంది. మన ట్రైన్స్ ట్రాక్ పైన ఎలక్ట్రిక్ వైర్లు ఉంటాయి కదా.. అలాంటివే ఎలక్ట్రిక్ వైర్లతో కూడిన ట్రాక్‌ను జర్మనీలోని ఓ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ఈ ఎలక్ట్రిక్ రోడ్ వే మీదుగా ట్రక్కులు రయ్ రయ్‌మంటూ దూసుకుపోతున్న ఒక వీడియోను కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆ  ఐడియాపై ప్రశంసల జల్లు కురిపించారు. ‘‘ఇది నెక్ట్స్ లెవెల్’’ అని కితాబిచ్చారు.. దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో @TansuYegen అకౌంట్‌లో డిసెంబర్ 29న పోస్ట్ చేయగా.. దాన్ని మాజీ మంత్రి కేటీఆర్ డిసెంబర్ 30న రీట్వీట్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటికే 3.58 లక్షల వ్యూస్, లక్షలాది లైక్స్ వచ్చాయి. జర్మనీలో ఈ ఎలక్ట్రిక్ రోడ్ వేను ‘సీమెన్స్ మొబిలిటీ’ కంపెనీ నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ టెక్నాలజీ వల్ల ఆ రూట్‌లో రాకపోకలు సాగించే వాహనాల ఇంధన వాడకం 50 శాతం తగ్గిపోయింది.

We’re now on WhatsApp. Click to Join.

ఎలక్ట్రిక్ హైవే టెక్నాలజీలో భాగంగా హైవేపై వెళ్లే ట్రక్కుల పైభాగంలో రైళ్ల మాదిరి కరెంట్‌ సరఫరా కోసం ప్రత్యేక ఏర్పాటు ఉంటుంది. దాని నుంచి ట్రక్కులోని బ్యాటరీల్లోకి విద్యుత్‌ సరఫరా అవుతుంది. అవి రీచార్జ్‌ అవుతూ ట్రక్కు ముందుకుసాగుతుంది. హైవే నుంచి డైవర్షన్‌ తీసుకున్న తర్వాత ఎలాగూ అప్పటికే బ్యాటరీలు ఛార్జ్‌ అవుతాయి.. కాబట్టి అందులోని విద్యుత్‌ను వినియోగించుకుని వాహనం కదులుతుంది. ఈ టెక్నాలజీతో మార్గం మధ్యలో మళ్లీ ఛార్జింగ్‌ చేసుకోకుండా వాహనం కదులుతున్నప్పుడే చార్జ్‌ అయ్యే వెసులుబాటు ఉంటుంది.

Also Read: Urinary Incontinence : మూత్రం లీక్.. కారణాలేమిటి ? కంట్రోల్ ఎలా ?

సోలార్‌ ఎనర్జీ సాయంతో రహదారులపై ట్రక్కులు, బస్సులు పరుగులు పెట్టేందుకు వీలుగా ఎలక్ట్రిక్‌ హైవేలు అభివృద్ధి చేయబోతున్నట్లు ఇటీవల కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు. రహదారిపై ఏర్పాటు చేసిన పవర్‌ కేబుళ్ల విద్యుత్‌ను వాడుకొని వాహనాలు సునాయాసంగా ప్రయాణిస్తాయన్నారు. ఇప్పటికే జర్మనీ, స్వీడన్‌, నార్వే వంటి దేశాల్లో ఈ సాంకేతికతను వినియోగిస్తున్నారని ఆయన(KTR – Electric Truck) తెలిపారు.

  Last Updated: 31 Dec 2023, 10:13 AM IST