Electric Scooter: 3 ఏళ్లు వారంటీతో బడ్జెట్ ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్..!

కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే అదిరే ఆప్షన్ అందుబాటులో ఉంది. తక్కువ ధరలోనే సూపర్ ఈవీ లభిస్తోంది.

బడ్జెట్ ధరలో అదిరిపోయే ఎలక్ట్రిక్ స్కూటర్ (Electric Scooter) కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే గుడ్ న్యూస్. ఎందుకంటే మీకోసం సూపర్ ఆప్షన్ ఒకటి అందుబాటులో ఉంది. కినెటిక్ గ్రీన్ అనే కంపెనీ పలు రకాల మోడళ్లను అందిస్తోంది. వీటిల్లో జింగ్ హెచ్ఎస్ఎస్ అనే మోడల్ కూడా ఒకటి ఉంది. దీన్ని అందుబాటు ధరలో కొనొచ్చు. ఫీచర్లు సూపర్ ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ (Electric Scooter) గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఒక్కసారి చార్జింగ్ పెడితే.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏకంగా 120 కి.మి. వెళ్తుందని కంపెనీ పేర్కొంటోంది. మల్టీ ఫంక్షనల్ రిమోట్ కీ ఫీచర్ ఉంది. దీని ద్వారా మీరు సులభంగానే ఎలక్ట్రిక్ స్కూటర్‌ను యాక్సెస్ చేయొచ్చు. ఇందులో ఇంకా హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్లు ఉన్నాయి. దీని వల్ల స్మూత్ రైడ్ ఉంటుంది. అలాగే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో వెహికల్ గైడ్ ఇండికేటర్ ఉంది. దీని ద్వారా బ్యాటరీ లెవెల్ ఎంత ఉందో చెక్ చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా వెహికల్ పార్ట్ ఫెయిల్ అయ్యిందా? అని చూడొచ్చు.

ఇంకా ట్రిప్ మీటర్ ఉంటుంది. అలాగే పార్కింగ్ ఇండికేటర్ కూడా ఉంటుంది. దీని ద్వారా మీరు మీ ఎలక్ట్రిక్ స్కూటర్ స్టేటస్ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఇంకా చార్జింగ్ పోర్ట్ కూడా ఉంటుంది. మీరు దీని ద్వారా మీ ఫోన్‌కు చార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇందులో మూడు రైడింగ్ మోడ్స్ ఉంటాయి. నార్మల్, ఎకో, పవర్ అనేవి ఇవి. ఇంకా ఇందులో డీటాచబుల్ బ్యాటరీ ఉంటుంది.

కంపెనీ ఇందులో లిథియం అయాన్ బ్యాటరీని కంపెనీ అమర్చింది. దీని ద్వారా ఎక్కువ కాలం మన్నిక వస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ చార్జ్ కావడానికి 3 నుంచి 4 గంటలు పడుతుంది. కినెటిక్ జింగ్ హెచ్ఎస్ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో రిమోట్ కీ ఉంటుంది. దీని ద్వారా నాలుగు ప్రయోజనాలు పొందొచ్చు. యాంటీ థెఫ్ట్ అలారం, కీ లెస్ ఎంట్రీ, ఫైండ్ మై స్కూటర్ అలర్ట్, లాక్ అన్‌లాక్ బటన్ వంటి బెనిఫిట్ లభిస్తున్నాయి. అందువల్ల మీరు మీ ఎలక్ట్రిక్ స్కూటర్ సేఫ్టీ గురించి భయపడాల్సిన అవసరం లేదు.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 88,835గా ఉంది. మూడేళ్ల వరకు వారంటీ లభిస్తుంది. కంపెనీ ఈ స్కూటర్2లో 60వీ 28 ఏహెచ్ కెపాసిటీ బ్యాటరీని అమర్చింది. డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. అందువల్ల అందుబాటు ధరలో అదిరే ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలని భావించే వారు దీన్ని ఒకసారి పరిశీలించొచ్చు.

Also Read:  Hair Fall in Teenagers: టీనేజ్‌‌ లో హెయిర్‌ ఫాల్‌కు కారణాలు ఇవే..!