Fuel Efficiency Tips : చలికాలం మొదలయింది. ఇక ఇప్పటినుంచి రోజు రోజుకి ఉష్ణోగ్రతలు తగ్గుతూనే వస్తాయి. అయితే చలి కాలంలో మంచి కురవడం అన్నది సహజం. చలికాలంలో అనారోగ్య సమస్యలు రాకుండా మనం ఎలా అయితే జాగ్రత్తలు తీసుకుంటామో అదే విధంగా కార్లు, బైకుల విషయంలో కూడా కొన్ని రకాల చిట్కాలు పాటించడం ద్వారా మైలేజీని పెంచుకోవచ్చు. మరి కార్ బైకుల మైలేజ్ (Fuel Efficiency) పెరగాలంటే అందుకోసం ఎటువంటి టిప్స్ ని పాటించాలో ఎప్పుడు మనం తెలుసుకుందాం..
టైర్ ప్రెజర్.. చలికాలంలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నప్పుడు, టైర్ ప్రెజర్ పడిపోతుంది. దీని వల్ల ఫ్యూయల్ సిస్టం ప్రభావితం చేస్తుంది. తయారీదారుల సిఫార్సుల ప్రకారం మీ టైర్ ప్రెజర్ క్రమం తప్పకుండా చెక్ చేయాలి. అలాగే మెయింటైన్ కూడా చేయాలి. తగినంత గాలి ప్రెజర్ మంచి మైలేజీని (Fuel Efficiency) అందించడమే కాకుండా చల్లని రోడ్లు, మంచు రోడ్లపై కూడా పట్టును పెంచుతుంది.
We’re Now on WhatsApp. Click to Join.
మీ డ్రైవింగ్ అలవాట్లను.. కాగా శీతాకాలంలో, ఫాస్ట్ డ్రైవింగ్ ముఖ్యంగా మైలేజీకి హానికరం. అనవసరమైన స్పీడ్ కాకుండా ఎకానమీ స్పీడ్ పాటించడం కారు మైలేజీకి అలాగే మీ ప్రాణాలకు కూడా చాలా మంచిది.అకస్మాత్తుగా ఆగి, హై స్పీడ్ తో స్టార్ట్ చేయడం ఎక్కువ ఇంధనం వినియోగిస్తుంది. ఇంకా మీ వాహనంపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. కాబట్టి చలికాలంలో వాహనాలను నెమ్మదిగా డ్రైవ్ చేయడం వల్ల మైలేజీని పెంచుకోవచ్చు.
ఇంజిన్ వేడెక్కడం.. రోడ్డుపైకి కారు వచ్చే ముందు ఇంజన్ హీట్ చేయడం మంచిది. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మోడ్రన్ ఇంజిన్లు మరింత సమర్థవంతంగా వేడెక్కుతాయి. అలాగే ఐడిల్ సమయాన్ని కూడా లిమిట్ చేయాలి. ఇంజిన్ దాని ఉష్ణోగ్రతకు చేరుకునే వరకు మొదటి కొన్ని నిమిషాలు నెమ్మదిగా డ్రైవ్ చేయాలి. ఈ విధానం ఇంధనాన్ని ఆదా చేయడమే కాకుండా మీ ఇంజన్ లైఫ్ ని కూడా పెంచుతుంది.
సరైన ఆయిల్ ఎంచుకోండి… అలాగే చలికాలపు వాతావరణం కోసం సరైన ఇంజిన్ ఆయిల్‌ను ఎంచుకోవడం తప్పనిసరి. మందపాటి ఆయిల్ రెసిస్టెన్స్ పెంచుతుంది. మీ వాహనం మాన్యువల్ ప్రకారం వింటర్-గ్రేడ్ ఆయిల్ కి మారాలి. దీనివల్ల ఇంజిన్ పనితీరును పెంచుతుంది అలాగే మంచి మైలేజీకి కూడా దోహదం చేస్తుంది.
అదనపు బరువు… అదేవిధంగా మీ వాహనంలో అనవసరమైన బరువును పెట్టడం వల్ల కూడా ఇంధన వినియోగం పెరుగుతుంది. మీ కారును నిర్వహించడానికి కొంత సమయం కేటాయించాలి. మీకు అవసరం లేని వాటిని, ముఖ్యంగా భారీ వస్తువులను తీసివేయడం మంచిది. ఎందుకంటె అదనపు బరువు ఉంటె మీ ఇంజిన్‌కి ఎక్కువ పని. దీని వల్ల మైలేజీ తగ్గుతుంది. తక్కువ లోడ్ మంచి మైలేజీకి సహాయపడుతుంది.
Also Read: Grow Thick Eyebrows: కనుబొమ్మలు ఒత్తుగా పెరగాలంటే ఈ సింపుల్ చిట్కాలను ఫాలో అవ్వాల్సిందే ?