కారు ఉన్న‌వారు ఈ ప‌నులు చేస్తున్నారా?

ఇంజిన్ ఓవర్‌హీట్ (అధికంగా వేడెక్కడం) కాకుండా కూలెంట్ కాపాడుతుంది. చాలా మంది ఇంజిన్ వేడెక్కి సమస్య వచ్చే వరకు దీనిని పట్టించుకోరు.

Published By: HashtagU Telugu Desk
Car Tips

Car Tips

Car Tips: కారు కొన్న తర్వాత చాలా మంది దానిని నడపడంపైనే దృష్టి పెడతారు. కానీ దాని నిర్వహణను తరచుగా నిర్లక్ష్యం చేస్తారు. ఈ అశ్రద్ధే భవిష్యత్తులో భారీ ఖర్చులకు, అకస్మాత్తుగా కారు మొరాయించడానికి కారణమవుతుంది. నిజానికి కొన్ని ప్రాథమిక మెయింటెనెన్స్ టిప్స్‌ను పాటిస్తే కారు ఎక్కువ కాలం మెరుగైన పనితీరును కనబరుస్తుంది. మీ జేబుపై భారం కూడా తగ్గుతుంది.

కారు సర్వీసింగ్ కోసం తప్పనిసరి చెక్‌లిస్ట్

కారు సర్వీసింగ్ సమయంలో మీకు ప్రాథమిక విషయాలు తెలియకపోతే అనవసరమైన పనులు జోడించే అవకాశం ఉంటుంది లేదా ముఖ్యమైనవి మిగిలిపోవచ్చు. అన్నింటికంటే ముఖ్యమైనది ఇంజిన్ ఆయిల్. సాధారణంగా కారు 8,000 నుండి 10,000 కిలోమీటర్లు తిరిగిన తర్వాత ఇంజిన్ ఆయిల్ మార్చడం మంచిది. ఇది ఇంజిన్‌ను స్మూత్‌గా ఉంచడమే కాకుండా దాని జీవితకాలాన్ని పెంచుతుంది.

ఎయిర్ ఫిల్టర్- టైర్ రొటేషన్

ఎయిర్ ఫిల్టర్: ఇంజిన్‌కు స్వచ్ఛమైన గాలిని అందించడమే దీని పని. ఇది మురికిగా మారితే మైలేజ్, పనితీరు రెండూ తగ్గుతాయి. అందుకే ప్రతి 15,000 కిలోమీటర్లకు ఒకసారి ఎయిర్ ఫిల్టర్ మార్చడం ఉత్తమం.

టైర్ రొటేషన్: సుమారు 10,000 కిలోమీటర్ల తర్వాత టైర్లను రొటేట్ చేయడం వల్ల అవి సమానంగా అరుగుతాయి మరియు ఎక్కువ కాలం మన్నుతాయి.

Also Read: బీఆర్ఎస్ హయాంలో అవినీతిని కవితనే బయట పెట్టారు -పొన్నం ప్రభాకర్ సంచలనం

కూలెంట్ తనిఖీ

ఇంజిన్ ఓవర్‌హీట్ (అధికంగా వేడెక్కడం) కాకుండా కూలెంట్ కాపాడుతుంది. చాలా మంది ఇంజిన్ వేడెక్కి సమస్య వచ్చే వరకు దీనిని పట్టించుకోరు. సుమారు 40,000 కిలోమీటర్లకు ఒకసారి కూలెంట్‌ను తనిఖీ చేయించి, అవసరమైతే మార్చడం వల్ల సుదీర్ఘ ప్రయాణాల్లో ఇంజిన్ సురక్షితంగా ఉంటుంది.

బ్యాటరీ, స్పార్క్ ప్లగ్

ప్రతి సర్వీసింగ్ సమయంలో బ్యాటరీని తనిఖీ చేయడం చాలా ముఖ్యం. చాలా సర్వీస్ సెంటర్లు దీనిని ఉచితంగానే చేస్తాయి. ఇక స్పార్క్ ప్లగ్ విషయానికి వస్తే కారు మోడల్‌ను బట్టి ప్రతి 40,000 కిలోమీటర్ల తర్వాత వీటిని చెక్ చేయించాలి. స్పార్క్ ప్లగ్ సరిగ్గా లేకపోతే కారు స్టార్టింగ్ సమస్యలు రావడమే కాకుండా మైలేజీ కూడా తగ్గుతుంది.

ట్రాన్స్‌మిషన్ ఫ్లూయిడ్- వైపర్ బ్లేడ్‌లు

ట్రాన్స్‌మిషన్ ఫ్లూయిడ్: మీరు మాన్యువల్ కారు నడుపుతున్నట్లయితే 60,000 కిలోమీటర్ల తర్వాత గేర్ ఆయిల్ (ట్రాన్స్‌మిషన్ ఫ్లూయిడ్) తనిఖీ చేయించండి. దీనివల్ల గేర్లు సులభంగా పడతాయి.

వైపర్ బ్లేడ్: వర్షం లేదా పొగమంచులో రోడ్డు స్పష్టంగా కనిపించాలంటే వైపర్లు బాగుండాలి. వాడకాన్ని బట్టి ప్రతి 10 నుండి 12 వేల కిలోమీటర్లకు ఒకసారి వీటిని మార్చడం మంచిది.

  Last Updated: 21 Jan 2026, 03:44 PM IST