Car Discount Offer: కొత్త కారు కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే ఇదే కరెక్ట్ టైమ్. ఇప్పుడు కార్ల కొనుగోలుపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు రన్ అవుతున్నాయి. మీరు వేలల్లో డబ్బును ఆదా చేసుకునే అవకాశం కలదు. ఈ ఆఫర్ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలని ఉందాం. అయితే ఇంకెందుకు ఆలస్యం ఈ ఆర్టికల్ చదవండి.
కార్ల తయారీలో దిగ్గజ సంస్థగా పేరుగాంచిన మారుతీ సుజుకీ తాజగా అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. ఏకంగా రూ. 57 వేల డిస్కౌంట్‌పై కార్లను అందుబాటులో ఉంచింది. కేవలం ఈ నవంబర్ నెలలో మాత్రమే ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని సంస్థ ప్రతినిధులు తెలిపారు. వీటిలో మీకు ఎక్స్చేంజ్ ఆఫర్, క్యాష్‌బ్యాక్, కార్పొరేట్ బెనిఫిట్స్ వంటి బెనిఫిట్స్ ను కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. మోడల్ బట్టి ఈ ఆఫర్లు మారుతూ ఉంటాయి. దీనికోసం మీరు దగ్గరలోని డీలర్‌ను సంప్రదించవలసి ఉంటుంది.
డిస్కౌంట్‌పై లభిస్తున్న మోడల్స్….
అల్టో కే10 కారుపై మీరు ఏకంగా రూ. 57 వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. క్యాష్ డిస్కౌంట్ రూ. 35 వేల వరకు ఉంటుంది. కార్పొరేట్ బెనిఫిట్ రూ. 7 వేలు వర్తిస్తుంది. ఇక ఎక్స్చేంజ్ బోనస్ కింద మరో రూ. 15 వేలు తగ్గింపు దక్కించుకోవచ్చు. సెలెరియో కారుపై కూడా రూ. 56 వేల వరకు తగ్గింపును పొందవచ్చు.
డిజైర్ మోడల్‌పై కూడా భారీ డిస్కౌంట్‌ను మీ సొంతం చేసుకోవచ్చు. ఈ కారుపై రూ. 32 వేల వరకు తగ్గింపు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. దీంతో పాటు అదనంగా రూ.7వేల కార్పొరేట్ బెనిఫిట్, క్యాష్ డిస్కౌంట్ రూ. 15 వేల దాకా పొందొచ్చు. ఇంకా ఎక్స్చేంజ్ బోనస్ రూ.10 వేల దాకా వస్తుంది.