Audi India: 88 శాతం వృద్ధి చెందిన ఆడి ఇండియా

జర్మనీ ఆడి కంపెనీ కార్లను తయారు చేసి 110 దేశాల్లో విక్రయిస్తోంది. ముఖ్యంగా 2004 నుంచి కంపెనీ ఉత్పత్తులను భారత మార్కెట్‌లో విక్రయిస్తున్నారు.

Audi India: జర్మనీ ఆడి కంపెనీ కార్లను తయారు చేసి 110 దేశాల్లో విక్రయిస్తోంది. ముఖ్యంగా 2004 నుంచి కంపెనీ ఉత్పత్తులను భారత మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. ఆ నాటి నుండి ఇప్పటి వరకు ఆడి తన కస్టమర్ల కోసం వివిధ రకాల SUVలను అందిస్తోంది.

ఇప్పుడున్న ఆటోమొబైల్ సాంకేతిక అభివృద్ధికి అనుగుణంగా కార్లు తయారవుతున్నందున, దాని విక్రయాలు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. దీని ఆధారంగా ఈ ఏడాది అంటే 2023 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు మొత్తం 5,530 కార్లను విక్రయించి 88 శాతం వృద్ధిని సాధించింది. ముఖ్యంగా Audi Q8 e-tron, Audi Q8 Sportback e-tron, Audi Q3 మరియు స్పోర్ట్‌బ్యాక్ (Sportback) మరియు ఆడి ఎ4 (Audi A4), ఆడి ఎ6 (Audi A6), ఆడి క్యూ 5 (Audi Q5) మరియు ఆడి క్యూ7 (Audi Q7), Audi Q8, Audi Q 8 కార్లు భారీగా అమ్ముడుపోయాయి. ఇది కాకుండా SUV లు కూడా 187 శాతం వృద్ధిని సాధించాయి.

రాబోయే పండుగల సీజన్‌లో కస్టమర్లు ఆడి ఎ4, ఆడి ఎ6, ఆడి క్యూ3, ఆడి క్యూ3 స్పోర్ట్‌బ్యాక్, క్యూ 5, ఆడి క్యూ7 వంటి కార్లను ఎక్కువగా కొనుగోలు చేయడం వల్ల అమ్మకాల వృద్ధి పెరుగుతుందని సంస్థ అంచనా వేసింది.

Also Read: BRS B-Forms : బీఆర్ఎస్ లో బీ-ఫామ్స్ టెన్షన్.. అందుకున్న అభ్యర్థులు వీరే..