Limp Mode : దేశంలో కార్ల వినియోగం బాగా పెరిగింది. రోజురోజుకూ పెరుగుతున్న వ్యక్తిగత, వ్యాపారపరమైన, ఉద్యోగపరమైన అవసరాల కోసం జనం కార్లను తెగ కొనేస్తున్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా కార్ల కంపెనీలు కూడా కొత్తకొత్త ఫీచర్లతో కార్లను మార్కెట్లోకి తెస్తున్నాయి. మీరు ఒకవేళ కొత్తగా కారు కొనాలని భావిస్తే.. తప్పనిసరిగా ‘లింప్ మోడ్ టెక్నాలజీ’ గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి.
We’re now on WhatsApp. Click to Join.
లింప్ మోడ్.. ఏమిటి ? ఎలా ?
- కారులోని స్పీడ్ మీటర్లో కనిపించే ఒక సేఫ్టీ ఫీచర్ పేరే ‘లింప్ మోడ్’.
- కారులో ఫ్యూయల్ ట్రాన్స్‌మిషన్ వ్యవస్థ, ఇంజిన్, సెన్సార్ సరిగ్గా పనిచేయనప్పుడు లింప్ మోడ్ యాక్టివ్ అవుతుంది.
- కారులోని ట్రాన్స్‌మిషన్ ఫ్లూయిడ్ కలుషితమైనప్పుడు, కారు కంట్రోల్ మాడ్యూల్‌లో పనిచేయనప్పుడు లింప్ మోడ్ ఆన్ అవుతుంది.
- కారులోని వైరింగ్ దెబ్బతిన్నప్పుడు, స్పార్క్ ప్లగ్‌లలోని సమస్యల వల్ల కారు లింప్ మోడ్‌లోకి వెళ్తుంది.
- లింప్ మోడ్ .. కారులోని సిస్టమ్ లోపాన్ని గుర్తించి అలర్ట్ చేస్తుంది.
- ఇది కారు స్పీడ్ లిమిట్‌ను కంట్రోల్ చేస్తూ, దెబ్బతిన్న భాగాలకు నష్టం కలగకుండా నిరోధిస్తుంది.
- కారులోని ప్రధాన భాగాలు ఫెయిల్ అయినప్పుడు కారును, డ్రైవర్‌ను లింప్ మోడ్ రక్షిస్తుంది.
- మీరు లింప్ మోడ్ నుంచి బయటకు రావడానికి ముందుగా సమస్య ఎక్కడ ఉందో గుర్తించాలి.
- ఒకవేళ మీ కారులో తలెత్తిన సమస్య చిన్నదే అయి ఉంటే.. కారును రీస్టార్ట్ చేస్తే లింప్ మోడ్ ఆఫ్ అయిపోతుంది. ఒకవేళ సెన్సార్ సమస్యలు, ట్రాన్స్‌మిషన్ సిస్టమ్ సమస్యలుంటే మీరు మెకానిక్‌ను కాంటాక్ట్ చేయాలి.
- కారు లింప్ మోడ్‌లోకి వెళ్లినప్పుడు మీ కారుకు సర్వీసింగ్, మెయింటెనెన్స్ తప్పక అవసరం(Limp Mode) అవుతుంది.