Triumph Tiger 1200 : బ్రిటన్‌కు చెందిన ట్రయంఫ్ కంపెనీ మరో కొత్త బైక్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఈసారి దీపావళి పండుగ వేళ విడుదల చేసిన నూతన బైక్ మోడల్ పేరు.. ‘ట్రయంఫ్ 2025 టైగర్ 1200’!! ఇది జీటీ ప్రో, జీటీ ప్రో ఎక్స్‌ప్లోరర్, ర్యాలీ ప్రో, ర్యాలీ ప్రో ఎక్స్‌ప్లోరర్(Triumph Tiger 1200) అనే నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. వీటిలో జీటీ ప్రో వేరియంట్ ధర దాదాపు రూ. 19.39 లక్షలు ఉంది.
Also Read :Russia Vs Google : గూగుల్‌పై కట్టలేనంత భారీ జరిమానా.. రష్యా సంచలన నిర్ణయం
‘ట్రయంఫ్ 2025 టైగర్ 1200’ ఫీచర్లు..
- ‘ట్రయంఫ్ 2025 టైగర్ 1200’ బైక్ 1160 సీసీ ఇన్‌లైన్ త్రీ సిలిండర్ టీ ప్లేన్ ఇంజిన్‌తో వస్తుంది.
- ఈ బైక్‌లోని ఇంజిన్ 9వేల ఆర్‌పీఎం వద్ద 150 బీహెచ్‌పీ పవర్.. 7వేల ఆర్‌పీఎం వద్ద 130 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది.
- ఇందులో గేర్ షిఫ్ట్ చాలా సున్నితంగా జరుగుతుంది. బైకర్లు కంఫర్ట్‌గా ఫీలవుతారు.
- ఈ కంపెనీకి చెందిన మునుపటి బైక్ మోడళ్లలో ఉన్న క్రాంక్ షాఫ్ట్, ఆల్టర్నేటర్ రోటర్, బ్యాలెన్సర్‌లో మార్పులు చేసి.. ఈ బైక్‌ను సరికొత్తగా తీసుకొచ్చారు.
- ‘టైగర్ 1200 జీటీ ప్రో వేరియంట్’లో 19-18 అంగుళాల అలాయ్ వీల్ కాంబినేషన్ ఉంటుంది.
- ‘టైగర్ 1200 ర్యాలీ ప్రో వేరియంట్’లో 21-18 అంగుళాల ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్ ఉంటాయి.
- జీటీ ప్రో ఎక్స్‌ప్లోరర్ మోడల్ బైకులో 30 లీటర్ల కెపాసిటీ కలిగిన ఫ్యూయెల్ ట్యాంక్ ఉంటుంది.
- ర్యాలీ ప్రో ఎక్స్‌ప్లోరర్ మోడల్ బైకులో 20 లీటర్ల కెపాసిటీ కలిగిన ఫ్యూయెల్ ట్యాంక్ ఉంటుంది.
- ‘ట్రయంఫ్ 2025 టైగర్ 1200’ బైక్‌లో మోడ్రన్ ఎలక్ట్రానిక్ ఎయిడ్స్, ప్రీమియం సైకిల్ పార్ట్స్ ఉన్నాయి.
- ఈ బైక్‌లో ఐఎంయూతో కార్నరింగ్ ట్రాక్షన్ కంట్రోల్ ఉంది.
- ఆరు రైడింగ్ మోడ్స్‌తో 7 ఇంచుల టీఎఫ్‌టీ స్క్రీన్, కీలెస్ ఇగ్నిషన్ సిస్టమ్, బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్లు ఈ బైకులలో ఉన్నాయి.