Site icon HashtagU Telugu

Chetak: 2023 చేతక్ వచ్చేసింది. ప్రీమియం మోడల్ తో చేతక్ రేంజ్ అదుర్స్.

2023 Chetak Has Arrived. The Chetak Range Adds A Premium Model.

2023 Chetak Has Arrived. The Chetak Range Adds A Premium Model.

బజాజ్ ఆటో 2023 చెతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ (2023 Bajaj Chetak) ను పరిచయం చేసింది. ఇప్పటికె ఉన్న చెతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌తో పోలిస్తే ఇందులో ఫీచర్స్, లుక్స్ కాస్త ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న చెతక్ స్టాండర్డ్ వర్షన్ ఎక్స్ షోరూమ్ ధర రూ.1.22 లక్షలు కాగా, ప్రీమియం మోడల్ 2023 వర్షన్ ఎక్స్ షోరూమ్ ధర రూ.1.52 లక్షలు. 2023 బజాజ్ చేతక్‌కు పెద్దగా డిజైన్ మార్పులు లేవు కానీ స్టైల్‌లో కాస్త మార్పులు ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు మూడు కొత్త రంగులలో అందుబాటులో ఉంది. మ్యాటీ కోర్స్ గ్రే, మ్యాటీ కరీబియన్ బ్లూ, శాటిన్ బ్లాక్ కలర్స్‌లో లభిస్తుంది. 2023 ఎడిషన్‌లో పెద్ద, ఆల్-కలర్ ఎస్‌సీడీ డిజిటల్ కన్సోల్ ఉంది. ఇది ఇప్పటికే ఉన్న వెర్షన్ కంటే మెరుగైన స్పష్టతను ఇస్తుంది.

2023 చెతక్ (Chetak) ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ప్రీమియం టూ – టోన్డ్ సీట్, బాడీ – కలర్ రియర్ వ్యూ మిర్రర్స్, శాటిన్ బ్లాక్ గ్రాబ్ రైల్, మ్యాచింగ్ పిలియన్ ఫుట్‌రెస్ట్ కాస్టింగ్స్ ఉన్నాయి. ఇవి కాకుండా హెడ్‌ల్యాంప్ కేసింగ్, ఇండికేటర్స్, సెంట్రల్ ట్రిమ్ ఎలిమెంట్స్ లాంటివి ఇప్పుడు చార్‌కోల్ బ్లాక్‌లో రిఫ్రెష్ లుక్‌ని అందిస్తోంది. డిజైన్ పరంగానే కాదు రేంజ్ పరంగా కూడా అప్‌గ్రేడ్స్ ఉన్నాయి. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 108 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. పాత మోడల్‌లో 90 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. అంటే పాత మోడల్ కన్నా 20 శాతం అధికంగా రేంజ్ ఇస్తుంది. బ్యాటరీ సైజ్‌లో ఎలాంటి మార్పు లేదు. 2.88 kWh బ్యాటరీ ఉంటుంది. పవర్ కూడా అలాగే ఉంది. 4.2 kW (5.3 bhp) PMS మోటార్‌తో 20 Nm గరిష్ట టార్క్‌ను అభివృద్ధి చేస్తుంది.

2023 చెతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ బుకింగ్ ప్రారంభమైంది. కేవలం రూ.2,000 చెల్లించి ఈ స్కూటర్‌ను బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు ఏప్రిల్ నుండి ప్రారంభమవుతాయి. 2023 బజాజ్ చెతక్ ఆల్-మెటల్ బాడీతో వస్తుంది. ఛార్జర్ కూడా లభస్తుంది. సుమారు నాలుగు గంటల్లో బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయగలదు. ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ లేదు. కంపెనీ భారతదేశంలోని 60 నగరాల్లో ఇ-స్కూటర్‌ను అమ్ముతోంది. ఈ ఏడాది మార్చి చివరి నాటికి 85 నగరాల్లోని 100 స్టోర్‌లకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Also Read:  Sonia Gandhi: సోనియా గాంధీకి మళ్లీ అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు