2022 Kawasaki Versys 650: మార్కెట్లోకి విడుదలైన కవాసకి కొత్త బైక్.. దీని ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

జపనీస్ ద్విచక్ర వాహన తయారీ దారు కంపెనీ కవాసకి సరికొత్త ద్విచక్ర వాహనాన్ని మార్కెట్లోకి విడుదల చేశారు. కవాసకి వెర్సిస్ 650 పేరుతో అత్యధిక ఫీచర్లు కలిగినటువంటి ద్విచక్ర వాహనం మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది.

  • Written By:
  • Publish Date - July 1, 2022 / 07:20 AM IST

జపనీస్ ద్విచక్ర వాహన తయారీ దారు కంపెనీ కవాసకి సరికొత్త ద్విచక్ర వాహనాన్ని మార్కెట్లోకి విడుదల చేశారు. కవాసకి వెర్సిస్ 650 పేరుతో అత్యధిక ఫీచర్లు కలిగినటువంటి ద్విచక్ర వాహనం మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది.ప్రస్తుత కాలంలో ఎన్నో అధునాతనమైన ఫీచర్లు కలిగినటువంటి ద్విచక్ర వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే కవాసకి వెర్సిస్ 650 న్యూ మోడల్ బైక్ అందుబాటులోకి వచ్చింది. దీని ధర అక్షరాల రూ.7.36 లక్షలు ఉంది.

ఇప్పటికే నింజా 300 ,400 లాంచ్ చేసిన కవాసకి తాజాగా వెర్సిస్ 650 న్యూ మోడల్ అందుబాటులోకి తెచ్చింది. ఈ ద్విచక్ర వాహనం ఫీచర్లు విషయానికి వస్తే ఈ బైక్ లో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ తొలగించి మొట్టమొదటిసారిగా బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన 4.3 అంగుళాల టీఎఫ్టీ ఇచ్చారు. అలాగే ABS ని మాడ్యూలేట్ చేసే డ్యూయల్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టం ఇచ్చారు. ఇది కఠిన పరిస్థితిలలో కూడా ద్విచక్ర వాహనాన్ని నడిపే వారి నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది.

ఇక ఈ న్యూ వెర్షన్ బైక్ ఇంజన్ విషయానికి వస్తే వెర్సిస్ 650లో లిక్విడ్-కూల్డ్ ప్యారలల్-ట్విన్ 650 cc ఇంజిన్‌ అమర్చారు. దీనిని 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేశారు. ఇక బ్రేక్ విషయానికి వస్తే ఫ్రంట్ వీల్ కోసం డ్యూయల్ పిస్టన్ కాలిపర్ తో 300 mm పెటల్ డిస్క్, వెనుకవైపు సింగిల్-పిస్టన్ కాలిపర్‌తో ఒకే 250 మిమీ నాన్-పెటల్డ్ డిస్క్-బ్రేక్  ఇచ్చారు. న్యూ వర్షన్ బైక్ మెటాలిక్ ఫాంటమ్ సిల్వర్, లైమ్ గ్రీన్ అని రెండు కలర్స్ లో లభిస్తుంది. ఈ బైక్ ప్రస్తుతం ఆన్లైన్ లో బుకింగ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది.