YV Subba Reddy Responds : తిరుమల లడ్డు (Tirumala Laddu) ప్రసాదంలో నెయ్యి (Pure Ghee)కి బదులు జంతువుల కొవ్వు (Animal Fat ) వాడారని చంద్రబాబు (Chandrababu) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. గత ప్రభుత్వంలో హిందూ దేవాలయాలపై పలు దాడులు , అనేక దుశ్చర్యాలు జరిగాయని ఇప్పటికే హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా..ఇప్పుడు ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో లడ్డు ప్రసాదాన్ని జంతువుల కొవ్వుతో తయారు చేశారనేది తట్టుకోలేకపోతున్నారు.
నిన్న చంద్రబాబు NDA సమావేశంలో మాట్లాడుతూ..జగన్ పాలనలో తిరుమల శ్రీవారి పవిత్రతను దెబ్బతీశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దేవుడి ప్రసాదం (Tirumala Laddu) అపవిత్రం చేసేలా నాసిరకం పదార్థాలు వాడారని , గతంలో తిరుమల లడ్డూ నాణ్యత సరిగా లేదని వెంకటేశ్వరస్వామి పవిత్రతను దెబ్బతీశారని , అన్నదానంలో కూడా నాణ్యత పాటించలేదని , దేవుడి ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారని కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ వ్యాఖ్యలపై TTD మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (YV Subba Reddy) స్పందించారు.
తిరుమల ప్రసాదంపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గమని ఆయన అన్నారు. ‘కోట్ల మంది హిందువుల విశ్వాసాలను దెబ్బతీసి చంద్రబాబు పెద్ద పాపమే చేశారు. రాజకీయ లబ్ధి కోసం ఎంతటి నీచానికైనా ఆయన వెనకాడరని మరోసారి నిరూపితమైంది. ఈ విషయంలో ఆ దేవదేవుని సాక్షిగా కుటుంబంతో కలిసి ప్రమాణం చేయడానికి నేను సిద్ధం. చంద్రబాబు సిద్ధమా?’ అని సవాల్ విసిరారు. ‘చంద్రబాబు, లోకేశ్, వారి కుటుంబం ..ప్రమాణం చేయడానికి రెడీగా ఉన్నారా? మేం సవాల్ చేస్తున్నాం’ అని వైసీపీ (YCP) సైతం ట్వీట్ చేసింది.
అలాగే మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) సైతం దీనిపై రియాక్ట్ అయ్యారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబు దుర్మార్గపు ఆరోపణ చేయడం సరికాదని రాంబాబు మండిపడ్డారు. దమ్ముంటే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ‘రాజకీయ లబ్ధి కోసం మరీ ఇంత నీచానికి దిగజారుతావా చంద్రబాబు’ అని ట్వీట్ చేసారు. మరి దీనికి చంద్రబాబు ఏ సమాధానం చెపుతారో చూడాలి.
Read Also : India Vs US : భారత ప్రభుత్వానికి, అజిత్ దోవల్‌కు అమెరికా కోర్టు సమన్లు.. ఎందుకు ?