Site icon HashtagU Telugu

AP : ఎవరు పార్టీని వీడిన నష్టమేలేదు – వైవీ సుబ్బారెడ్డి

Yv Subbareddy

Yv Subbareddy

ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ వరుస పెట్టి అధికార పార్టీ వైసీపీ (YCP) నేతలంతా బయటకు వస్తూ..టీడీపీ (TDP) , జనసేన (Janasena) పార్టీలలో చేరుతున్నారు. ఇదే సందర్బంగా సీఎం జగన్ (CM Jagan) ఫై ఉన్న ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గ నిధులు ఇవ్వమంటే ఇవ్వరని , కనీసం నియోజకవర్గ సమస్యలను అడిగితెలుసుకోరని..ఇలా చేస్తే ఎలా అంటూ వారంతా మండిపడుతున్నారు. అయితే వైసీపీ అధిష్టానం మాత్రం ఎవరు పోయిన నష్టమేమి లేదని, ప్రజలు జగన్ కు ఓటు వేసి గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా వైవీ సుబ్బారెడ్డి (YV Subba Reddy) మాట్లాడుతూ.. ఏపీలో సంక్షేమ పథకాల ద్వారా లబ్దిపొందుతున్న పేదలందరూ వైసీపీని మరోసారి గెలిపించి వైఎస్‌ జగన్‌ను సీఎంని చేస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. బీసీలకు సీట్లు ఇవ్వటం కోసమే కొన్ని సీట్లు సర్దుబాటు చేయాల్సి వస్తుంది.. ఒకరిద్దరు వెళ్లటం వల్ల మాకేమీ నష్టం లేదన్నారు. కొందరు వారి వ్యక్తిగత కారణాల బయటకు వెళ్తున్నారు.. వెళ్లే వాళ్ల భవిష్యత్తుకు భరోసా ఇచ్చినా వెళ్తున్నారని విమర్శించారు. సీఎం జగన్.. ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు.

టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్ని యాత్రలు చేసినా, డ్రామాలు వేసినా ప్రజలు నమ్మే పరిస్దితి లేదని అన్నారు. 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌.. ఒకరిపై ఒకరు ఎన్ని ఆరోపణలు చేసుకున్నారో అందరూ చూశారన్న ఆయన.. చంద్రబాబు హయాంలో ఒక్క హామీని కూడా అమలు చేయకుండా పాలన చేశారని ఆరోపించారు. కానీ, మేం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు ఇచ్చిన హామీలు నెరవేర్చాం అన్నారు. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పధకాల వల్లే 175 నియోజకవర్గాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేసారు.

Read Also : POSH Act : వర్కింగ్ ఉమెన్స్‌‌కు రక్షణ కవచం.. POSH యాక్ట్ వివరాలివీ