Site icon HashtagU Telugu

Yuvagalam : యువ‌గ‌ళంపై వైసీపీ షాడోలు! తాడేప‌ల్లి వ‌ర్గాల్లో లోకేష్‌ అల‌జ‌డి

Yuvagalam

Lokesh

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్ చేస్తోన్న పాద‌యాత్ర‌కు(Yuvagalam) ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి  భ‌య‌ప‌డుతున్నారా? నిఘా వ‌ర్గాల నుంచి స‌మాచారాన్ని సేక‌రిస్తూ హ‌డావుడి ఎందుకు సృష్టిస్తున్నారు? ఇలాంటి ప్ర‌శ్న‌లు ఎన్నో పొలిటిక‌ల్ స‌ర్కిల్స్ లో తిరుగుతున్నాయి. వాస్త‌వంగా ఇప్ప‌టి వ‌ర‌కు పాద‌యాత్ర చేసిన పార్టీలు అధికారంలోకి వ‌చ్చిన చ‌రిత్ర‌ను చూశాం. స్వ‌ర్గీయ రాజ‌శేఖ‌ర్ రెడ్డి నుంచి చంద్ర‌బాబు, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వ‌ర‌కు పాద‌యాత్ర ద్వారా అధికారంలోకి వ‌చ్చారు. అదే సెంటిమెంట్ ను తీసుకుంటే లోకేష్ (Lokesh) రాబోయే రోజుల్లో సీఎం అవుతార‌ని భ‌య‌మా? లేక చంద్ర‌బాబు త‌ద‌నంత‌రం టీడీపీ లేకుండా చేయాల‌ని కుట్ర జ‌రుగుతుందా? అనే ప్ర‌శ్న‌లు కూడా వినిపిస్తున్నాయి.

లోకేష్ చేస్తోన్న పాద‌యాత్ర‌కు(Yuvagalam)

గ‌తంలోనూ లోకేష్(Lokesh) కార్య‌క్ర‌మాలు అంటే పోలీసుల‌ను భారీగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం మోహ‌రించిన సంఘ‌ట‌న‌లు అనేకం. క్యాడ‌ర్ ఇళ్ల‌పై దాడులు, మాన‌భంగాలు, దాష్టీకాలు సృష్టించిన‌ప్పుడు బాధితుల‌కు అండ‌గా ఉండ‌డానికి లోకేష్ ప‌లు చోట్ల‌కు వెళ్లారు. ఆ సంద‌ర్భంగా భారీగా పోలీసుల‌ను మోహ‌రించి బాధితుల ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌కుండా అడ్డుకున్న సంద‌ర్భాలు అనేకం. ఉదాహ‌ర‌ణ‌కు ద‌ళిత మ‌హిళ‌పై మాన‌భంగం జ‌రిగిన‌ప్పుడు న‌ర‌స‌రావుపేట వెళ్ల‌డానికి లోకేష్ ప్ర‌య‌త్నించారు. ఆ సంద‌ర్భంగా గత ఏడాది వేలాది మంది పోలీసుల‌ను జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం మోహ‌రించింది. ఆయ‌న సంఘ‌ట‌నా స్థ‌లానికి వెళ్ల‌కుండా అడ్డుకున్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా చేయ‌డాన్ని గ‌త రెండేళ్లుగా చూస్తున్నాం. క‌రోనా స‌మ‌యంలో ఇంట‌ర్ విద్యార్థుల‌కు ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేయాల‌ని లోకేష్ చేసిన జూమ్ పిలుపుకు యూత్ పెద్ద ఎత్తున మ‌ద్ధ‌తు ప‌లికారు. దీంతో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ దిగొచ్చింది. ఇలా ఆయ‌న ప‌ట్టుబ‌ట్టిన ప‌లు అంశాల‌పై విజ‌యం సాధించారు.

Also Read : Yuvagalam : ఏపీ పోలీస్ ఓవ‌రాక్ష‌న్‌! లోకేష్ పాద‌యాత్ర‌కు జ‌నాద‌ర‌ణ‌!!

ప్ర‌స్తుతం పాద‌యాత్ర(Yuvagalam) చేస్తోన్న లోకేష్ మీద సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అటెన్ష‌న్ ప్లే చేశారు. ప్ర‌భుత్వం మొత్తం ఇప్పుడు లోకేష్ యాత్ర గురించి ఆలోచిస్తోంది. ఫ‌లితంగా యువ‌గ‌ళం మ‌రింత‌ హైలైట్ అయ్యేలా ప‌రోక్షంగా వైసీపీ స‌హ‌క‌రిస్తుంద‌న్న సంగ‌తిని ఆ పార్టీ గ‌మ‌నించ‌డంలేదు. అనుమ‌తుల మంజూరు విష‌యంలో చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ క్రియేట్ చేసి ఇవ్వ‌డం యువ‌గళం తొలి విజ‌యం. పోలీసుల హ‌డావిడితో రోజూ వార్త‌ల్లో ప్ర‌ముఖంగా క‌నిపించ‌డం రెండో విజ‌యంగా చెప్పుకోవ‌చ్చు. సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని సంతృప్తి ప‌ర‌చ‌డానికి కుప్పంలో ఎస్పీ రిశాంత్ రెడ్డి, ప‌ల‌మ‌నేరు డిఎస్పీ సుధాక‌ర్ రెడ్డి త‌దిత‌రులు చేస్తున్న ఓవ‌ర్ యాక్ష‌న్ ప్ర‌జ‌ల దృష్టిని ఆకర్షిస్తోంది.

వైసీపీ సోష‌ల్ మీడియా ప్ర‌త్యేక టీము ద్వారా పాద‌యాత్ర లైవ్

యువ‌గ‌ళానికి (Yuvagalam)జ‌నం లేరంటూ ఒక వైపు వైసీపీ సోష‌ల్ మీడియా ప్ర‌త్యేక టీము ద్వారా పాద‌యాత్ర లైవ్ ఇస్తున్నాయి. ఇంకో వైపు ఇంటిలిజెన్స్ వాళ్లు డ్రోన్లు, లైవ్ ఎక్విప్మెంట్ ద్వారా పాద‌యాత్ర‌లో ప్ర‌తీ క్ష‌ణాన్ని రికార్డు చేసి తాడేప‌ల్లి పెద్ద‌ల‌కు రియ‌ల్ టైములో పంపుతున్నారు. ఇంటిలిజెన్స్, వైసీపీ సోష‌ల్ టీములతో పాటు వాళ్ల‌ను కాపాడేందుకు మ‌ఫ్టీ పోలీసులు, బందోబ‌స్తు కోసం వ‌చ్చిన పోలీసుల‌తో యువ‌గ‌ళం ప్ర‌తిరోజూ కిటకిటలాడుతోంది. రెండు వారాలుగా మ‌ఫ్టీ లోని పోలీస్‌, యూనిఫాం బ్యాచ్ వెర‌సి 200 మంది పైనే పాద‌యాత్ర‌ని రెండు వారాలుగా ఫాలో అవుతున్నార‌ని టాక్‌. లోకేష్(Lokesh) త‌ప్పుల‌ను ఎంచ‌డానికి, జ‌గ‌న్ ని దూషించార‌ని కౌంట‌ర్ ఇవ్వ‌డానికి మ‌రొక‌రు, నిబంధ‌న‌లు ఉల్లంఘించార‌ని చెప్పేందుకు ఇంకొక‌రు లెక్క‌న రోజూ వైసీపీ నుంచి ప్రెస్మీట్లు, ప్ర‌క‌ట‌న‌లు, ట్వీట్ల‌తో యుద్ధం చేస్తున్నారు.

వైసీపీ అఫీషియ‌ల్ సోష‌ల్ మీడియా ఖాతాల‌న్నీ లోకేష్‌ని(Lokesh)

జ‌గ‌న్ భ‌జ‌న‌లో త‌రించే వైసీపీ అఫీషియ‌ల్ సోష‌ల్ మీడియా ఖాతాల‌న్నీ లోకేష్‌ని(Lokesh) ట్రోల్ చేయ‌డానికి, పాద‌యాత్ర‌లో జ‌నం లేరు అని చెప్ప‌డానికి ఫుల్ గా వాడుతున్నారు. ఫ‌లితంగా వైసీపీ సోష‌ల్మీడియా ఖాతాల్లో టిడిపి సోష‌ల్ మీడియా కంటే ఎక్కువ‌గా లోకేష్‌కి ప్ర‌చారం ద‌క్కుతోంది. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి లోకేష్ పాద‌యాత్ర‌ని ప‌ట్టించుకోకుండా ఉంటే, ఇంత హైలైట్ అయ్యేది కాదు. ఈ విష‌యంలో నారా లోకేష్ తెలివిగా వ్య‌వ‌హ‌రిస్తూ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ట్రాప్‌లో ప‌డేశార‌ని కొంద‌రు భావిస్తున్నారు. ఇప్పుడు ప్ర‌భుత్వం, పోలీసులు, వైసీపీ, వైసీపీ సోష‌ల్మీడియా మొత్తం నారా లోకేష్ నామ‌స్మ‌ర‌ణే. యువ‌గ‌ళం(Yuvagalam) పాద‌యాత్ర వార్త‌లే వైసీపీ గ్రూపులలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

మంత్రులు ముక్త‌కంఠంతో లోకేష్ యాత్ర మీద ఫోక‌స్(Yuvagalam)

సాధార‌ణంగా బ‌ల‌మైన శ‌త్రువు గురించి ఎక్కువ‌గా ప్ర‌త్య‌ర్థులు ఆలోచిస్తుంటార‌ట‌. రాజ‌కీయంగా బ‌ల‌మైన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇంత‌గా లోకేష్(Lokesh) వెంటాడుతున్నారంటే ఏదో కార‌ణం ఉంటుంది. నిఘా వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం లోకేష్ బ‌లంగా క‌నిపించి ఉండాలి. లేదంటే, స‌హ‌జంగా బ‌ల‌హీన‌మైన శ‌త్రువునైనా బ‌లంగా కొట్టాల‌ని యోచిస్తున్నారా? అనేది వైసీపీ క్యాడ‌ర్ కు బోధ‌ప‌డ‌డంలేదు. కార‌ణం ఏదైనాప్ప‌టికీ లోకేష్ పాద‌యాత్ర‌కు మాత్రం వైసీపీ చాలా ప్రాధాన్యం ఇస్తుంద‌ని అర్థ‌మ‌వుతోంది. మంత్రులు ముక్త‌కంఠంతో లోకేష్ యాత్ర మీద ఫోక‌స్ చేయ‌డం చూస్తున్నాం. ఇలాంటి ప‌రిణామాల‌న్నీ యువ‌గ‌ళం(Yuvagalam) విజ‌యంగా తీసుకోవాల్సిందే.

Also Read : Yuvagalam :`చింత‌కాయ‌ల` రూపంలో బ్రేక్? లోకేష్ యాత్ర‌కు పోలీస్ అడ్డంకులు!