Yuvagalam : లోకేష్ యాత్ర వేళ జూనియ‌ర్ RRR !చంద్ర‌బాబు ట్వీట్లపై దుమారం !

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్ పాద‌యాత్ర‌పై(Yuvagalam) మూకుమ్మ‌డి రాజ‌కీయ దాడికి వైసీపీ ప్లాన్ చేసింది.

  • Written By:
  • Updated On - January 25, 2023 / 05:22 PM IST

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్ పాద‌యాత్ర‌పై(Yuvagalam) మూకుమ్మ‌డి రాజ‌కీయ దాడికి వైసీపీ ప్లాన్ చేసింది. సోష‌ల్ మీడియా వేదిక‌గా జూనియ‌ర్ ఎన్టీఆర్ (NTR)వ్య‌వ‌హారాన్ని వ్యూహాత్మ‌కంగా వైసీపీ తెర‌మీద‌కు తీసుకొస్తోంది. తాజాగా చంద్ర‌బాబు త్రిబుల్ ఆర్ సినిమా ఆస్కార్ నామినేష‌న్ కు ఎంపికైన సంద‌ర్భంగా విషెస్ చెబుతూ జూనియ‌ర్ కూడా ట్యాగ్ చేశారు. డైరెక్ట‌ర్ రాజ‌మౌళి , రామ్ చ‌ర‌ణ్ త‌దిత‌రుల‌ను ట్యాగ్ చేస్తూ జూనియ‌ర్ ఎన్టీఆర్ కూడా ట్యాగ్ చేయ‌డాన్ని పెద్ద న్యూస్ గా వైసీపీ ఫోక‌స్ చేస్తోంది. దానికి జూనియ‌ర్ రిప్లై ఇవ్వ‌క‌పోవ‌డాన్ని భూత‌ద్దంలో చూపిస్తోంది.

లోకేష్ పాద‌యాత్ర‌పై మూకుమ్మ‌డి రాజ‌కీయ దాడి (Yuvagalam)

త్రిబుల్ సినిమా సాంగ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డును గెలుచుకున్న సంగ‌తి తెలిసిందే. ఆ సంద‌ర్భంగా మాజీ సీఎం చంద్ర‌బాబునాయుడు అభినంద‌లు తెలుపుతూ ట్వీట్ చేశారు. అయితే, జూనియ‌ర్ కు ట్యాగ్ చేయ‌లేదు. అయిన‌ప్ప‌టికీ థాంక్యూ మామ‌య్య అంటూ జూనియ‌ర్ ఎన్టీఆర్ రీ ట్వీట్ చేయ‌డం నెటిజ‌న్ల ప‌లు ర‌కాలుగా స్పందించారు. డైరెక్ట‌ర్ రాజ‌మౌళి, కీర‌వాణికి ఆ రోజు చంద్ర‌బాబు ట్యాగ్ చేశారు. జూనియ‌ర్ కు ట్యాగ్ చేయ‌న‌ప్ప‌టికీ రిప్లై ఇవ్వ‌డాన్ని వీరాభిమానులు స‌మ‌ర్థించుకున్నారు. మ‌రికొంద‌రు చంద్ర‌బాబుతో చేతులు క‌ల‌ప‌డానికి జూనియ‌ర్ సిద్ధ‌మ‌య్యాడ‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా కామెంట్స్ ను హోరెత్తించారు.

Also Read : Yuvagalam : లోకేష్ పాద‌యాత్ర‌కు పోలీస్ అనుమ‌తి, స‌వాల‌క్ష కండీషన్లు!

గోల్డెన్ గ్లోబ్ అవార్డును గెలుచుకున్న సంద‌ర్భంగా చంద్ర‌బాబు చేసిన ట్వీట్ , జూనియ‌ర్ రీ ట్వీట్ మీద వారం పాటు సోష‌ల్ మీడియా వేదిక‌గా నెటిజ‌న్లు ప‌లు ర‌కాలుగా స్పందించారు. దానిపై ఒక యుద్ధాన్ని న‌డిపించారు. తాజాగా ఆస్కార్ కు త్రిబుల్ నామినేష‌న్ కు ఎంపిక కావ‌డంపై చంద్ర‌బాబు చేసిన ట్వీట్ ను రాజ‌కీయ కోణం నుంచి వైసీపీ లాగుతోంది. జూనియ‌ర్ కు కూడా ఈసారి ట్యాగ్ చేయ‌డాన్ని మ‌రో కోణం నుంచి చూస్తోంది. అయితే, నామినేష‌న్ స్థాయిలోనే త్రిబుల్ ఆగిపోయింది. ఫైన‌ల్ చేరుకోలేదు. దీంతో తాత్కాలికంగా చంద్ర‌బాబు ట్వీట్ వ్య‌వ‌హారం నెమ్మ‌దించిన‌ప్ప‌టికీ రాజ‌కీయ కోణం నుంచి దుమారం రేప‌డానికి వైసీపీ ప్లాన్ చేస్తోంది.

జూనియ‌ర్  ప్ర‌భావం 

జూనియ‌ర్ ఎన్టీఆర్ ను ఉద్దేశ‌పూర్వ‌కంగా చంద్ర‌బాబు దూరంగా పెడుతున్నార‌ని తొలి నుంచి వైసీపీ నేత‌లు చెప్పే అభిప్రాయం. ఆ విష‌యంలో మాజీ మంత్రి కొడాలి వెంక‌టేశ్వ‌ర‌రావు, ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ ముందుంటారు. లోకేష్ రాజ‌కీయ భ‌విష్య‌త్ కోసం జూనియ‌ర్ ను పార్టీలో క్రియాశీల‌కం కానివ్వ‌డంలేద‌ని త‌ర‌చూ వైసీపీ చెప్పే మాట‌. జూనియ‌ర్ మాత్రం ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. త‌ర‌చూ జూనియ‌ర్ మాట స‌భ‌ల్లో వినిపించే సంద‌ర్బాల్లో చంద్ర‌బాబు నైస్ గా ప‌క్క‌న పెట్టేస్తుంటారు. ఆయ‌న స‌భ‌ల్లో జూనియ‌ర్ క‌టౌట్ లు లేకుండా ఇటీవ‌ల జాగ్ర‌త్త ప‌డ్డారు. అయిన‌ప్ప‌టికీ జూనియ‌ర్(NTR) ప్ర‌భావం ఎప్ప‌టిక‌ప్పుడు టీడీపీ మీద ప‌డుతోంది. దాన్ని ప్ర‌త్య‌ర్థులు సానుకూలంగా మ‌లుచుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇప్పుడు కూడా లోకేష్ పాద‌యాత్ర‌కు(Yuvagalam)  జూనియ‌ర్ అభిమానుల‌ను దూరంగా ఉంచాల‌ని వైసీపీ స్కెచ్ వేసింది. అందుకే, చంద్ర‌బాబు తాజాగా చేసిన త్రిబుల్ ట్వీట్ల‌ను వివాదంలోకి లాగ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తోంది.

Also Read : Junior : చంద్ర‌బాబుపై `జూనియ‌ర్` అస్త్రం! వైసీపీ త‌ర‌హాలో బీఆర్ఎస్ ఎత్తుగ‌డ‌!