Yuvagalam Padayatra: పోవాలి జగన్ రావాలి బాబు నినాదంతో లోకేష్ యువగలం పాదయాత్ర సాగుతుంది. యువగలం పాదయాత్రలో నారా లోకేష్ కి అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మహిళలు తిలకం దిద్ది ఆశీర్వదిస్తున్నారు. ప్రతి నియోజవర్గాన్ని సందర్శిస్తానని చెప్పిన లోకేష్ ప్రస్తుతం మంగళగిరిలో తన పాదయాత్ర కొనసాగిస్తున్నారు. లోకేష్ పాదయాత్రకు ముందు మంగళగిరి ప్రజలు బ్యానర్లు, ఫ్లెక్సీలతో తమ అభిమానాన్ని చాటుకున్నారు. మరికొందరి కాస్త అడుగు ముందుకేసి 50 కార్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. MG సంస్థకు చెందిన రెడ్ కలర్ 50 కార్లతో టీడీపీ శ్రేణులు వినూత్నంగా ర్యాలీ చేపట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారి అభిమానుల సందడి ఇది. యువగళం పాదయాత్ర సందర్భంగా నియోజకవర్గానికి వస్తున్న యువనేతకు ఘనస్వాగతం పలికేందుకు తెలుగుదేశం శ్రేణులు యువగళం స్టిక్కర్లు ఉన్న 50 కార్లతో ఇలా నియోజకవర్గమంతా ర్యాలీ నిర్వహించారు… pic.twitter.com/FbPXnXHpEe
— Telugu Desam Party (@JaiTDP) August 14, 2023
ఏపీ రాజకీయాల్లో నారా లోకేష్ ప్రభావం కనిపిస్తుంది. గతంలో ఆయనపై అనేక విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియాలో ఆయన టంగ్ స్లిప్ క్లిప్పులను తెగ ట్రోల్ చేశారు. కానీ యువగలం పాదయాత్రతో తన స్టామినా చూపించారు. బహిరంగ సభలలో లోకేష్ స్పీచ్ లలో తేడా కనిపిస్తున్నది. అధికార పార్టీ తప్పొప్పులను ఎండగట్టడంలో లోకేష్ విజయం సాధిస్తున్నారు. మాటల తూటాలు పేల్చుతున్నారు. సీఎం జగన్ ని టార్గెట్ చేసి లోకేష్ స్పీచ్ తో హోరెత్తిస్తున్నారు. ఇక పాదయాత్రలో భాగంగా ఆయనకు మహిళల నుంచి భారీగా మద్దతు లభిస్తున్నది.
Also Read: Gaddar Statue: ట్యాంక్ బండ్ పై గద్దర్ విగ్రహం.. సమాధి వద్ద షర్మిల నివాళి