Site icon HashtagU Telugu

Yuvagalam : యువగళం పాదయాత్రను వాయిదా వేయాలని కోరుతున్న టీడీపీ నేతలు..

TDP and YCP Activists fighting in Nara Lokesh YuvaGalam Padayatra at Bhimavaram

TDP and YCP Activists fighting in Nara Lokesh YuvaGalam Padayatra at Bhimavaram

టీడీపీ శ్రేణుల్లో టెన్షన్ టెన్షన్ వాతావరణం నెలకొంది.ఇప్పటికే స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు (Chandrababu) ను అరెస్ట్ చేసి జైల్లో వేశారు. ఇప్పుడు అమరావతి రింగ్ రోడ్ కేసులో నారా లోకేష్ (Nara Lokesh) ఫై కేసు నమోదు చేసారు. దీంతో ఏ క్షణంలోనైనా ఆయన్ను అరెస్ట్ చేయొచ్చనే వార్తలు టీడీపీ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తుంది. ప్రస్తుతం ఢిల్లీ లో ఉన్న లోకేష్..రేపు తిరిగి యువగళం (Yuvagalam) పాదయాత్ర ను పున: ప్రారభించబోతున్నారు. ఈ క్రమంలో ఆయన ఏపీలో అడుగుపెడితే అరెస్ట్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ క్రమంలో యువగళం పాదయాత్రను మరో వారం రోజుల పాటు వాయిదా వేయాలని టీడీపీ నేతలు కోరుతున్నారు. వారం రోజుల్లో అంత సెట్ అవుతుందని , ఆ తర్వాత పాదయాత్ర ప్రారంభిస్తే బాగుంటుందని అంటున్నారు.

శుక్రవారం నంద్యాలలో పార్టీ పీఎసీ కమిటీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కమిటీ సమావేశంలో ఢిల్లీ నుంచి సామాజిక మాధ్యమం ద్వారా లోకేశ్ పాల్గొంటారని సమాచారం. చంద్రబాబును అరెస్టు చేసిన ప్రాంతంలోనే సమావేశం నిర్వహించాలని నిర్ణయించారట. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై రేపటి సమావేశంలో తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈలోగా లోకేశ్ అరెస్టు చేసినట్లయితే…నారా బ్రాహ్మణి పాదయాత్ర చేసేందుకు రెడీ అయినట్లు సమాచారం. ఇప్పటికే కుటుంబ సభ్యులు బ్రాహ్మణికి అన్ని విషయాల గురించి వివరించారట. బ్రాహ్మాణి నారా, నందమూరి కుటుంబాలకు చెందినది కావడంతో…ఆమె పాదయాత్ర చేపడితే ప్రజల నుంచి సానుభూతి ఎక్కువగా వస్తుందని అంచనా వేసినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికి ప్రస్తుతం మాత్రం టీడీపీ శ్రేణుల్లో టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది.

Read Also : TTD: శ్రీవారి గురువారం నిజరూప దర్శనం గురించి మీకు తెలుసా