YSRCP : ప్లీజ్ ఒక్క‌సారి సీఎం అపాయిట్‌మెంట్ ఇప్పించండి.. వైసీపీలో జిల్లా అధ్య‌క్షుడు ఆవేద‌న‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డిని క‌ల‌వ‌డం ఎంత క‌ఠిన‌మో ఆ పార్టీ నేత‌ల మాట‌ల్లోనే తెలిసిపోతుంది. నాలుగున్న‌రేళ్లుగా

  • Written By:
  • Publish Date - December 31, 2023 / 10:13 AM IST

వైసీపీ అధినేత జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డిని క‌ల‌వ‌డం ఎంత క‌ఠిన‌మో ఆ పార్టీ నేత‌ల మాట‌ల్లోనే తెలిసిపోతుంది. నాలుగున్న‌రేళ్లుగా సీఎంగా ఉన్న జ‌గ‌న్‌ని అసెంబ్లీలో త‌ప్ప క్యాంప్ కార్యాల‌యంలో క‌లిసి మాట్లాడిన సంద‌ర్భం లేద‌ని ఎమ్మెల్యేలు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఒక్క‌సారైన అధినేత జ‌గ‌న్ అపాయింట్‌మెంట్ ఇప్పించండి అంటూ వైసీపీ పెద్ద‌ల ద‌గ్గ‌ర‌కు క్యూక‌డుతున్నారు. ఎన్నిక‌ల ద‌గ్గ‌ర ప‌డుతున్న వేళ ఎమ్మెల్యేల్లో టెన్ష‌న్ మొద‌లైంది. ఎవ‌రికి సీటు ఉంటుందో ఎవ‌రికి పోతుందో అన్న ఆందోళ‌న‌లో వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్ప‌టికే 11 మందిని స‌మ‌న్వ‌య‌క‌ర్త‌లుగా నియ‌మించిన అధిష్టానం మ‌రో రెండు రోజుల్లో రెండో జాబితాను విడుద‌ల చేయ‌నుంది. అయితే రెండో జాబితాపై వైసీపీ అధిష్టానం తీవ్ర‌క‌స‌రత్తు చేస్తుంది. అసంతృప్తులు ఎక్కువ‌గా ఉండ‌టంతో వారిని బుజ్జ‌గించే ప‌నిని రిజ‌న‌ల్ కోఆర్డినేట‌ర్ల‌కు అప్ప‌గించింది. కోఆర్డినేట‌ర్లు చెప్పిన‌ప్ప‌టికి అంసంతృప్తులు స‌సేమిరా అంటున్నారు. సీఎంవోకు వెళ్లిన అక్క‌డ ధ‌నుంజ‌య‌రెడ్డి, సజ్జ‌ల రామ‌కృష్ణారెడ్డిని క‌లిసి రావ‌డం త‌ప్ప ఒక్క‌సారి కూడా అధినేత‌ను క‌లిసి త‌మ బాధ‌ను చెప్పుకునే అవ‌కాశం లేద‌ని ఎమ్మెల్యేలు వాపోతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా ఉమ్మ‌డి గుంటూరు జిల్లాకు చెందిన మాజీమంత్రి, సీనియ‌ర్ నేత డొక్కా మాణిక్య వ‌ర‌ప్ర‌సాద్ సీఎం జ‌గ‌న్‌పై హాట్ కామెంట్స్ చేశారు. టీడీపీని కాద‌ని వైసీపీలో చేరిన డొక్కాకు ఆ పార్టీలో స‌రైన ప్రాధాన్య‌త లేదు. సామాజిక సాధికార బ‌స్సుయాత్ర కార్య‌క్ర‌మంలో డొక్కా చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మైయ్యాయి. తాను అడ‌గ‌కుండానే తాడికొండ నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా నియ‌మించార‌ని.. కానీ కొన్ని నెల‌ల‌కే త‌న‌ను మార్చి వేరే వారిని నియ‌మించడంపై ఆయ‌న తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. తాడికొండ‌లో పోటీ చేయాల‌ని అధిష్టానం చెప్తేనే వెళ్లాలని.. స‌ర్వేల పేరుతో ఇప్పుడు త‌న‌ను కాద‌ని వేరే వాళ్ల‌ను నియ‌మించ‌డం ఏంటని ఆయ‌న ప్ర‌శ్నించారు. త‌న బాధ‌ను చెప్పుకునేందుకు ఒక్క‌సారి అధినేత జ‌గ‌న్ అపాయింట్‌మెంట్ ఇప్పించాల‌ని వేద‌క‌పై ఉన్న వైసీపీ పెద్ద‌ల‌ను ఆయ‌న ప్రాధేయ‌ప‌డ్డారు. వైసీపీలో జ‌గ‌న్ నిర్ణ‌యాన్ని ప్ర‌శ్నించే ధైర్యం ఎవ‌రికి లేద‌న్నారు.

Also Read:  Srikakulam : శ్రీకాకుళం రిమ్స్‌లో దారుణం.. హౌస‌ఖ స‌ర్జ‌న్‌ని లైగింకంగా వేధించిన‌..?