Roja Sensational Comments: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు పూర్తైంది. ఈ సమయంలోనే ప్రతిపక్ష వైసీపీ నాయకులు టీడీపీ కూటమి పాలనపై విమర్శలు మొదలుపెట్టారు. ఇప్పటికే పలువురు వైసీపీ నాయకులు టీడీపీ కూటమిపై ప్రెస్ మీట్లు పెట్టి మరీ విమర్శలు చేస్తున్నారు. తాజాగా వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తనదైన మాటలతో (Roja Sensational Comments) టీడీపీ కూటమిపై విరుచుపడ్డారు.
మాజీ మంత్రి రోజా మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆరు నెలల కాలంలో ఈ నియోజకవర్గానికి వాళ్లు ఏం చేశారు అని అడిగితే ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్ట్రాంగ్‌గా ఉన్న లీడర్లు పేద ప్రజల కోసం పని చేసే లీడర్ల ఇంటి ముందు గుమ్మాలు కొట్టడం వాళ్ల పొలాలకు అడ్డంగా గోడలు కట్టడం చేస్తున్నారని మండిపడ్డారు. అలాగే వాళ్ల మీద తప్పుడు కేసులు పెట్టి పోలీసులతో వాళ్లని బెదిరించడం ఇలాంటి నీతిమాలిన చర్యలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
Also Read: Greenfield Expressway: సాధారణ ఎక్స్‌ప్రెస్‌వే- గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేలకు మధ్య తేడా ఇదే!
కూటమి ప్రభుత్వం EVM లను మానేజ్ చేసి, దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది – @RojaSelvamaniRK pic.twitter.com/JvLnYCPVhW
— greatandhra (@greatandhranews) December 18, 2024
వాళ్లు ఇచ్చిన సూపర్ సిక్స్ కానీ లేదా మిగతా వాగ్దానాలు కానీ ఏవీ నేరవేర్చకుండా ఏ విధంగా ప్రజలను మోసం చేశారో ప్రజలందరికీ ఇప్పుడే అర్థమైపోయింది. కానీ దురదృష్టం ఏంటంటే తాగే నీళ్ల దగ్గర నుంచి ప్రజలకు అన్ని అందుబాటులోకి తీసుకొచ్చే సచివాలయం, ఆర్‌బీకే సెంటర్ అన్ని కూడా ఇక్కడ లీడర్లు వాళ్లు ల్యాండ్ ఇచ్చి కట్టించి అన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. కానీ తెలుగుదేశం గతంలో 14 సంవత్సరాలు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు అప్పుడు ఏం చేయలేదు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ఏం చేయకుండా వాళ్లు ఫెయిల్యూర్ అయిన విషయాన్ని కప్పి పుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
టీడీపీ నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీడర్లని వేధించడం, భయాభ్రాంతులను చేయాలన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నారని ఆరోపించారు. వాళ్లు అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే మా నాయకుడు జగన్ మోహన్ రెడ్డి భయం అనేది ఆయన బ్లడ్‌లో లేదు. ఆయన వెనక పనిచేస్తున్నా మేమందరం కూడా జగన్ అన్న సైనికులుగా ముందుకు వెళ్తున్నాం. ఎవరికీ భయపడే పరిస్థితి లేదు. ఎందుకంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మేమవ్వరం తప్పు చేయలేదు. అయిదేళ్లు కూడా ప్రజలకు మంచే చేశాం. నియోజకవర్గాలు అన్ని అభివృద్ధి చేశాం. ఈరోజు మీరు మోసంతో అధికారంలోకి వచ్చారు. ఈవీఎంలు మ్యానిపులేట్ చేసి వచ్చారు. ఏ విధంగా సూపర్ సిక్స్‌లు అంటూ ప్రజలను మోసం చేసి వచ్చారు. మీరు సిగ్గుపడాలి మేము సిగ్గు పడాల్సిన అవసరం లేదు. కానీ ఈరోజు టీడీపీ వాళ్లను హెచ్చరిస్తున్నాం. ఇలాంటి పనికి మాలిన కార్యక్రమాలు మరోసారి చేస్తే సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.