YSRCP 11th List : వైసీపీ 11వ లిస్టులో పెద్ద ట్విస్టు.. ఆయనకు బంపరాఫర్

YSRCP 11th List : ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను వేగంగా  ఖరారు చేస్తోంది.

  • Written By:
  • Publish Date - March 9, 2024 / 07:50 AM IST

YSRCP 11th List : ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను వేగంగా  ఖరారు చేస్తోంది. ఇప్పటికే నియోజకవర్గాల ఇంచార్జ్‌లను మారుస్తూ 10 జాబితాలను విడుదల చేయగా.. శుక్రవారం రాత్రి తాజాగా 11వ జాబితాను వైసీపీ విడుదల చేసింది. ఇందులో మూడు నియోజకవర్గాలకు ఇంఛార్జ్‌లను ప్రకటించారు. ఇందులో రెండు లోక్‌సభ, ఒక అసెంబ్లీ స్థానానికి ఇంఛార్జ్‌ల పేర్లు ఉన్నాయి. కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం ఇంఛార్జిగా బీవై రామయ్య, అమలాపురం పార్లమెంటు నియోజకవర్గం ఇంఛార్జిగా రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ను జగన్ నియమించారు. రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం ఇంఛార్జిగా ఇటీవల పార్టీలో చేరిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు నియమితులయ్యారు.

We’re now on WhatsApp. Click to Join

  • మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంను తొలుత కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ ఇంఛార్జిగా వైసీపీ నియమించింది. అయితే ఆయన ఆలూరు అసెంబ్లీ నుంచే తిరిగి పోటీచేస్తానని పట్టుపట్టారు. దీనికి వైసీపీ అధిష్టానం నో చెప్పడంతో జయరాం టీడీపీ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకే ఇప్పుడు అక్కడి నుంచి బీవై రామయ్యకు జగన్ ఛాన్స్ ఇచ్చారు.
  • రాజోలు సిట్టింగ్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌కు మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలను జగన్ అప్పగించారు. అంటే ఈసారి రాపాక వరప్రసాద్‌ లోక్‌సభకు పోటీ చేయనున్నారన్న మాట. రాజోలు అసెంబ్లీ ఇంఛార్జిగా మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావును నియమించారు.
  • 2019 ఎన్నికల్లో రాజోలు నుంచి రాపాక వరప్రసాద్ జనసేన తరఫున గెలిచారు. నాటి ఎన్నికల్లో జనసేన నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఆయనే. ఆ తర్వాతి పరిస్థితుల్లో రాపాక వరప్రసాద్ వైసీపీలో చేరారు.
  • 2019 ఎన్నికల్లో  రాపాక వరప్రసాద్ చేతిలో గొల్లపల్లి సూర్యారావు ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి టీడీపీ ఇంఛార్జిగా కొనసాగుతూ వచ్చిన గొల్లపల్లి.. జనసేనతో టీడీపీ పొత్తులో భాగంగా టికెట్ రాదనే అనుమానంతో వైసీపీలో చేరిపోయారు.
  • ఇప్పటివరకు రిలీజ్ చేసిన 11 జాబితాల్లో(YSRCP 11th List) 75 అసెంబ్లీ, 23 లోక్‌సభ స్థానాలను వైసీపీ ఇంఛార్జ్‌లను ప్రకటించింది. సీఎం జగన్ ఓ వైపు  అభ్యర్థులను ఖరారు చేస్తూనే.. మరోవైపు సిద్దం పేరుతో బహిరంగ సభలు నిర్వహిస్తూ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.

Also Read : Health tips: బిర్యానీ ఆకుతో ఇలా చెస్తే.. షుగర్ మాయం అవ్వాల్సిందే?

Also Read : Lok Sabha Polls 2024: లోక్‌సభ ఎన్నికలకు రాహుల్ ఇచ్చిన 5 హామీలు