Site icon HashtagU Telugu

Alla Ramakrishna Reddy : షర్మిల వెంట నడుస్తా – ఆర్కే

Rk Shamrila

Rk Shamrila

గత ఎన్నికల్లో వైసీపీ పార్టీ నుండి మంగళగిరి ఎమ్మెల్యేగా గెలిచిన ఆళ్ల రామకృష్ణ (YSRCP Rebel MLA Alla Ramakrishna Reddy ) ..ఈ మధ్య వైసీపీ (YCP) పార్టీ కి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. నిన్నటి వరకు ఆళ్ల నెక్స్ట్ ప్లాన్ ఏంటి..? ఏ పార్టీ లో చేరతారు..? అనేదాని గురించి నియోజకవర్గ ప్రజలతో పాటు రాజకీయ నేతలు మాట్లాడుకున్నారు. అయితే ఈయన మాత్రం వైస్ షర్మిల వెంటే నడుస్తానని ప్రకటించారు.

తెలంగాణ లో YSRTP పేరుతో పార్టీ స్థాపించిన షర్మిల..ఇప్పుడు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దమవుతుంది. అంతే కాదు కాంగ్రెస్ సైతం ఈమెను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా చేయాలనీ ఫిక్స్ అయ్యింది. రీసెంట్ గా కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర పార్టీ నేతలతో సమావేశమైనప్పుడు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖరే , అగ్రనేత రాహుల్‌ గాంధీ ఈ విషయం వారికి తెలియజేశారు. ఈ భేటీకి రాష్ట్ర కాంగ్రెస్‌ ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌, వర్కింగ్‌ కమిటీ సభ్యుడు రఘువీరారెడ్డి, పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సుంకర పద్మశ్రీ, సీనియర్‌ నేతలు పళ్లంరాజు, జేడీ శీలం, కొప్పుల రాజు, కనుమూరి బాపిరాజు తదితరులు హాజరయ్యారు. మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె షర్మిల రాష్ట్ర కాంగ్రెస్‌ పగ్గాలు చేపట్టడంపై తొలుత మీమీ అభిప్రాయాలు చెప్పాలని నేతలను రాహుల్ కోరారు. ఇద్దరు మాజీ ఎంపీలు తప్ప అందరూ చేతులెత్తారు. ఆమె బాధ్యతలు చేపడితే పార్టీ బలోపేతమవుతుందని స్పష్టం చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

జనవరి ఫస్ట్ వీక్ లో మంచి ముహూర్తం చూసుకొని ఢిల్లీ(Delhi) వేదికగా షర్మిల కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు తెలుస్తుంది. ఏపీలో మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే అక్కడి రాజకీయాలు మారుతున్నాయి. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే అధికార వైసీపీ పార్టీ ఇంచార్జులను మార్చడంతో పాటు చాలా మంది సిట్టింగులకు టికెట్లు ఇచ్చే ప్రసక్తి లేదని తేల్చి చెప్పింది. అటు టీడీపీ కూడా ఇటీవల ప్రశాంత్ కిషోర్ తో సమావేశమై సరికొత్త వ్యూహాలను రచిస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ షర్మిల ను తమ పార్టీ లోకి తీసుకొని ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా ప్రకటించాలని చూస్తుంది. అందుకే షర్మిల వెంట నడుస్తానని ఆళ్ల రామకృష్ణ రెడ్డి తెలిపారు.

మంగళగిరి అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి 1200 కోట్లు కేటాయిస్తే అందరం సంతోషించామని .. కానీ, కరోనా ఇబ్బందుల కారణంగా నిధుల కోసం ఒత్తిడి చేయలేదన్నారు. ఆ తరువాత ఆ మొత్తాన్ని రూ 500 కోట్లకు కుదించారని..తరువాత మరోసారి 300 కోట్లకు తగ్గించి..చివరకు 125 కోట్లుగా ఖరారు చేసారని వివరించారు. మంగళగిరి నియోజకవర్గానికి ఈ రోజు వరకు ఒక్క రూపాయి ఇవ్వలేదని ఆర్కే చెప్పుకొచ్చారు. వైసీపీకి తాను ఎంత సేవ చేసినా..జగన్ తనను గుర్తించ లేదని వాపోయారు. తనకు టికెట్ ఇవ్వలేదని పార్టీ వీడలేదన్నారు. తాను లేకపోయినా మంగళగిరి అభివృద్ధి ఆగదన్నారు. తనకు చిరంజీవి ,జగన్ మధ్య ఏమి జరిగింది అనేది మా అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. అలాగే చంద్రబాబుపై వేసిన కేసులపై న్యాయ పోరాటం చేస్తానని ఆర్కే స్పష్టం చేసారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో కూడా కేసును వెనక్కి తీసుకొనని చెప్పుకొచ్చారు.

Read Also : TSRTC : గ్రేటర్ హైదరాబాద్‌లోని ఆర్టీసీ భూముల లీజు.. ఎందుకు ?

Exit mobile version