YCP MLA Daughter Marriage : దగ్గరుండి కూతురికి ప్రేమవివాహం జరిపించిన వైసీపీ ఎమ్మెల్యే..

ఆంధ్రప్రదేశ్ లో ఓ ఎమ్మెల్యే స్వయంగా తన కుమార్తెకు ప్రేమ పెళ్లి జరిపించడం చర్చనీయాంశమైంది.

Published By: HashtagU Telugu Desk
Ysrcp Mla Rachamallu Shivaprasad Reddy Daughter Love Marriage

Ysrcp Mla Rachamallu Shivaprasad Reddy Daughter Love Marriage

కులాలు, మతాలను పట్టించుకోకుండా.. తల్లిదండ్రులను ఎదిరించి ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న జంటలను పరువు కోసం చంపేస్తున్న ఈ రోజుల్లో.. ఆంధ్రప్రదేశ్ లో ఓ ఎమ్మెల్యే స్వయంగా తన కుమార్తెకు ప్రేమ పెళ్లి జరిపించడం చర్చనీయాంశమైంది.

వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు(Proddutur) ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి(MLA Rachamallu Shivaprasad Reddy) తన పెద్ద కూతురు పల్లవికి ఆమె ప్రేమించిన పవన్ అనే యువకుడితో బొల్లవరంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో సంప్రదాయబద్ధంగా వివాహం జరిపించారు. అనంతరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వారి పెళ్లిని రిజిస్టర్ చేయించారు.

కూతురు ఇష్టపడిన వ్యక్తితోనే వివాహం జరిపించినట్లు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ తెలిపారు. చదువుకున్న రోజుల్లో ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారని.. డబ్బు, హోదా, కుల గోత్రాలకు పట్టింపు లేకుండా ఇద్దరి ఇష్టప్రకారం వివాహం జరిపించినట్లు ఎమ్మెల్యే వివరించారు. వీరిద్దరిదీ కులాంతర వివాహమే. నూతన వధూవరులను ఎమ్మెల్యే ఆశీర్వదించారు. కులమతాలు వేరని, హోదాకు తగరన్న కారణాలతో ఎందరో ప్రేమికులు తమ ప్రేమకు దూరమవుతున్నారు. పిల్లల ప్రేమను వేర్వేరు కారణాలతో నిరాకరించే తల్లిదండ్రులకు.. ఎమ్మెల్యే రాచమల్లు తన కుమార్తెకు ప్రేమవివాహం జరిపించి ఆదర్శంగా నిలిచారు.

 

Also Read : Jagan Office Shifting : ఛ‌లో వైజాగ్…ముహూర్తం ఫిక్స్

  Last Updated: 07 Sep 2023, 08:59 PM IST