YCP MLA House Arrest: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పోలింగ్ రోజున తెనాలి వైసీపీ ఎమ్మెల్యే రాద్ధాంతం తీవ్ర చర్చకు దారి తీసింది. ఓటర్ పై చేసి చేసుకున్న వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పై ఈసీ చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో అతనిని గృహనిర్బంధం చేసినట్లు తెలుస్తుంది.
ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ రోజున తెనాలి వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌కు, ఓ సాధారణ ఓటరుకు మధ్య జరిగిన భౌతిక వాగ్వాదం హాట్ టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారం ఎన్నికల సంఘం దృష్టికి వెళ్లడంతో శివకుమార్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. పోలింగ్ ముగిసే వరకు గృహనిర్బంధం చేయాలని ఆదేశించారు.
ఎమ్మెల్యే శివకుమార్ తన పోలింగ్ కేంద్రానికి ఓటు వేసేందుకు వెళ్లారు. అయితే, ఆయన క్యూను దాటవేసి పోలింగ్ బూత్ వైపు వెళ్లారు. సుధాకర్ (55) అనే సాధారణ ఓటరు శివకుమార్‌ను ఎదురించి క్యూలో నిలబడమని అడిగాడు. సుధాకర్ ప్రశ్నకు ఆగ్రహించిన ఎమ్మెల్యే శివకుమార్ అతని చెంపదెబ్బ కొట్టాడు. వెంటనే స్పందించిన సుధాకర్ శివకుమార్‌ను తిరిగి కొట్టాడు. కాగా ఓటర్లు, శివకుమార్ మద్దతుదారులు పరస్పరం భౌతికదాడికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గాయపడిన సుధాకర్‌ను ఆస్పత్రికి బదులు పోలీస్‌స్టేషన్‌లో అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు శివకుమార్‌పై ఈసీకి ఫిర్యాదు చేసింది. ఈసీ అధికారులు వెంటనే చర్యలు తీసుకుని పోలింగ్ ముగిసే వరకు గృహనిర్బంధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
Also Read: AP Poll: ఓటు వేసిన ప్రఖ్యాత ఆర్థోపెడెషియన్ డాక్టర్ దశరథ రామ్ రెడ్డి