Site icon HashtagU Telugu

YSRCP : నేడు విజ‌య‌వాడ‌లో వైసీపీ ప్ర‌తినిధుల స‌భ‌.. న‌గ‌రంలో ట్రాఫిక్ మ‌ళ్లింపు

Ysrcp

Ysrcp

విజయవాడలోని ఇంధిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైసీపీ ప్ర‌తినిధుల స‌భ నేడు జ‌ర‌గ‌నుంది. ఈ స‌భ‌కు సీఎం జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజ‌రుకానున్నారు. సీఎం సభ కోసం విజ‌య‌వాడ‌లో ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించారు. బందర్ రోడ్డులోని ఐజీఎంసీ స్టేడియంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు సమావేశం దృష్ట్యా ట్రాఫిక్ మళ్లింపులు, ఆంక్షలు విధించారు. మహాత్మాగాంధీ రోడ్డు (ఎంజీ రోడ్డు), చుట్టుగుంట సెంటర్‌ నుంచి శిఖమణి సెంటర్‌ నుంచి వాటర్‌ ట్యాంక్‌ రోడ్డు వైపు ఎలాంటి వాహనాన్ని అనుమతించబోమని పోలీసు కమిషనర్ క్రాంతిరాణా టాటా తెలిపారు. ఆర్టీసీ బ‌స్సులు కూడా ఎంజీ రోడ్డులో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అనుమ‌తి లేద‌ని.. MG రోడ్డులో సిటీ బస్సును అనుమతించమ‌ని సీపీ తెలిపారు. పామర్రు, ఆటో నగర్‌ నుంచి వచ్చే సిటీ బస్సులు బెంజ్‌సర్కిల్‌ వద్ద మళ్లించి ఫకీర్‌గూడెం, స్క్రూ బ్రిడ్జి, కనకదుర్గా వారధి, పీఎన్‌బీఎస్‌ ఇన్‌గేట్‌ మీదుగా సిటీ బస్‌ టెర్మినల్‌కు వెళ్తాయని తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

ఎంజీ రోడ్డు, రూట్ 5 మీదుగా బెంజ్ సర్కిల్‌కు వెళ్లాల్సిన సిటీ బస్సులన్నీ పాత పోలీస్ కంట్రోల్ రూం, పాత ఆర్టీసీ జంక్షన్, హోటల్ స్వర్ణ ప్యాలెస్, అప్సర జంక్షన్, ఏలూరు రోడ్డు, చుట్టుగుంట, మాచవరం, రామవరప్పాడు రింగ్, మహానాడు జంక్షన్, రమేష్ హాస్ప‌ట‌ల్ మీదుగా మళ్లించబడతాయని తెలిపారు. నగరంలోని అన్ని రూట్లలో 108 అంబులెన్స్‌లు, ఇతర అత్యవసర సేవలను అనుమతిస్తారు. పుష్ప హోటల్, రెడ్ సర్కిల్ నుండి ఈట్ స్ట్రీట్, నైస్ బార్, శిఖామణి జంక్షన్ నుండి వాటర్ ట్యాంక్ వరకు వాహనాల రాకపోకలు నిలిపివేయబడతాయని సీపీ తెలిపారు. వైసీపీ ప్రతినిధులు తమ వాహనాల‌ను కేటాయించిన పార్కింగ్ ప్రదేశాలలో పార్క్ చేయాల‌ని కోరారు. రోడ్లపై వాహనాలు పార్కింగ్ చేయవ‌ద్ద‌న పోలీసులు కోరారు.

Also Read:  2023 Congress Candidates List : కాంగ్రెస్ ఫైనల్ చేసిన ఫస్ట్ 62 మంది అభ్యర్థులు వీరేనా..?