ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా రానేలేదు..అప్పుడు అధికార పార్టీ నేతలు ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు. ప్యాంట్లు, షర్టులు, చీరలు, కుక్కర్లు, సెల్‌ఫోన్లు, టీకప్పులు ఇలా అన్ని పట్టుకొని విధుల్లో తిరుగుతూ ఓటు జగన్ కే వేయాలంటూ పంపకాలు మొదలుపెట్టారు. ఇలాంటివి చేయకూడదని..చేస్తే కఠిన శిక్ష తప్పదని ఎన్నికల సంఘం చెపుతున్నప్పటికీ.. వైసీపీ (YCP) నాయకులు మాత్రం ఏమాత్రం లెక్కచేయకుండా పంపిణి చేస్తున్నారు.
హోంమంత్రి తానేటి వనిత తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెంలో జగన్ మళ్లీ సీఎం కావాలంటూ క్రైస్తవ పాస్టర్లతో ప్రార్థనలు చేయించారు. ఆ సమావేశానికి హాజరైన వారందరికీ కొత్త వస్త్రాలు పంపిణీ చేశారు. సీఎం జగన్ మేనత్త వై.ఎస్.విమలారెడ్డి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా క్రైస్తవ పాస్టర్లతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ జగన్‌ను ఆశీర్వదించాలని పిలుపునిస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
మంత్రి జోగి రమేశ్ అయితే క్రైస్తవులమైన మనమంతా ఏసు బిడ్డ జగన్‌ను (CM Jagan) మరొకసారి సీఎం గా, తనను ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలంటూ పాస్టర్లను, దైవ సహాయకులను కోరారు. సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డిల ఫొటోలు ముద్రించిన బ్యాగుల్లో చీరలు పెట్టి అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలో వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ పంపిణీ చేశారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి నియోజకవర్గ పరిధిలోని వాలంటీర్లకు రూ.7000ల చొప్పున నగదు పంపిణీ చేశారు. గాజువాక నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ ఉరుకూటి రామచంద్రరావు ఆధ్వర్యంలో వార్డు వాలంటీర్లకు కుక్కర్లు, రిసోర్స్‌పర్సన్లకు చీరలు పంపిణీ చేశారు. మంత్రి దాడిశెట్టి రాజా అయితే వాలంటీర్లకు సెల్‌ఫోన్లు ఇచ్చారు. నగరి నియోజకవర్గంలోని మహిళలకు మహిళా దినోత్సవ గిఫ్ట్‌ల పేరిట చీరలు, జాకెట్లు పంపిణీ చేశారు మంత్రి రోజా. ఇలా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో అధికార పార్టీ నేతలు పంపకాలు మొదలుపెట్టడం తో ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎన్నికల సంఘానికి పిర్యాదులు చేస్తున్నారు.
Read Also : Strange Weather : ఏపీలో వెరైటీ వాతావరణం.. కొన్ని జిల్లాల్లో ఎండలు.. కొన్ని జిల్లాల్లో వర్షాలు