Site icon HashtagU Telugu

Parliament Monsoon Session: పార్లమెంట్లో విపక్షాల తీరుపై విజయసాయిరెడ్డి కామెంట్స్

Parliament

New Web Story Copy (47)

Parliament Monsoon Session: పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో మణిపూర్ అంశం ప్రధాన ఎజెండాగా మారింది. ప్రతిపక్షాలు మణిపూర్ అంశాన్ని లేవనెత్తుతూ అధికార పార్టీ బీజేపీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మణిపూర్ అల్లర్లపై ప్రధాని నరేంద్ర మోడీ ఉభయసభల్లో మాట్లాడాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో సభ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఓ వైపు విపక్షాల ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం ఇస్తామని చెప్తున్నా, దానికి విపక్షాలు అడ్డుకోవడంతో పార్లమెంట్ సమావేశాలు వాయిదా పడుతున్న పరిస్థితి. పార్లమెంట్ సమావేశాలపై వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

మణిపూర్ అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పందిస్తామని చెప్తున్నా, విపక్షాలు పదే పదే సమావేశాలకు అడ్డుపడుతున్నాయని, ఈ చర్యను వైసీపీ సమర్ధించదని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. మణిపూర్ పూర్తిగా దేశ అంతర్గత భద్రతకు సంబందించిన అంశమని, అది పూర్తిగా కేంద్ర హోంశాఖ పరిధిలో ఉంటుందని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.

Also Read: Byjus Founder Tears : ఏడ్చేసిన “బైజూస్” రవీంద్రన్.. అప్పుల భారంతో తీవ్ర ఒత్తిడి!