Site icon HashtagU Telugu

YSR Life Time Achievement-2022: అట్ట‌హాసంగా `వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ -2022` వేడుక‌

Ysr Award

Ysr Award

వివిధ రంగాల‌కు చెందిన 35 మందికి 20 వైఎస్సార్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డులు, 10 వైఎస్సార్‌ అచీవ్‌ మెంట్‌ అవార్డులను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌, ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ అవార్డులు అందజేశారు. వరుసగా రెండో ఏడాది రాష్ట్ర ప్రభుత్వం తరపున వైఎస్సార్‌ అచీవ్‌మెంట్, వైఎస్సార్‌ లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డులను ప్రదానం జ‌రిగింది. ఈ అవార్డులన గొప్ప పనులకు ప్రదానం చేస్తున్నట్లు వెల్ల‌డించారు. ఈ అవార్డులు సంస్కృతి, సాంప్రదాయాలకు వారధులుగా ఉన్నవారికి ఇచ్చిన‌ట్టు జ‌గ‌న్ వెల్ల‌డించారు.

వెనుకబాటు, అణిచివేత, పెత్తందారీ పోకడల మీద దండయాత్ర చేస్తున్న సామాజిక ఉద్యమకారులకు, భిన్నమైన కళాలకు, గళాలకు, పాత్రికేయులకు ఈ అవార్డులు అందించ‌డం ఆనందంగా ఉంద‌ని అన్నారు. అంతర్జాతీయ కీర్తి గడించిన మహామహులకు, పారిశ్రామిక దిగ్గజాలను ఎంపిక‌ చేసి అవార్డులు ఇస్తున్నామన్నారు.

Also Read:  AP Electricity Scam: ఏపీలో 8వేల కోట్ల ప‌వ‌ర్ `కుంభ‌కోణం`?

విజయవాడ ఏ కన్వెన్షన్‌ సెంటర్‌లో వైఎస్సార్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్, వైఎస్సార్‌ అచీవ్‌ మెంట్‌ -2022 అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్, విశిష్ట అతిథిగా ముఖ్యమంత్రి వైయస్‌.జగన్, ఆత్మీయ అతిథిగా వైయస్‌.విజయమ్మ హాజరయ్యారు.

ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ల 3 నెలల కాలంలో రైతు పక్షపాత, మహిళా పక్షపాత, నిరుపేద పక్షపాత విధానాలకు, సామాజిక న్యాయానికి, ప్రాంతీయ న్యాయానికి, వైద్య రంగంలో తీసుకొచ్చిన విప్లవానికి, తెలుగుదనానికి, కళలు, సాంప్రదాయాలకు, శ్రమకు, పరిశ్రమకు వైఎస్సార్ ను గుర్తు చేసుకుంటూ ఈ అవార్డులు ఇస్తున్నట్లు జగన్ వెల్లడించారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డులు అందుకుంటున్న ప్రతి ఒక్కరికీ జగన్ హృదయపూర్వకంగా అభినందనలు తెలిపారు.

Also Read:   AP High Court given Green Signal for Amaravati Farmers: అమ‌రావ‌తి రైతుల‌కు హైకోర్టు గ్రీన్ సిగ్న‌ల్‌