Site icon HashtagU Telugu

YS Vijayamma: జగన్ నా కొడుకు కాకుండా పోతాడా..? విజ‌య‌మ్మ సంచ‌ల‌న వీడియో

YS Vijayamma

YS Vijayamma

YS Vijayamma: తనపై జగన్ హత్యాయత్నం చేశారని సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలపై వైఎస్ విజయమ్మ (YS Vijayamma) స్పందించారు. ‘‘పాత వీడియోపై ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం సరైన విధానం కాదు. ఇటీవల రెండు లేఖలు నేను రాసినవే.. నకిలీ లేఖలు రాయాల్సిన అవసరం నా కొడుకుకి లేదు. ఇంకోసారి తప్పుడు ప్రచారం చేస్తే పరువు నష్టం దావా వేస్తా’’ అంటూ వీడియోను విడుదల చేశారు.

సోషల్ మీడియాలో తనపై తన కొడుకు హత్య ప్రయత్నం చేశాడని ప్రచారంపై ఆందోళన వ్యక్తం చేశారు విజయమ్మ. పాత వీడియో బయటకు తీసి ఈ రకంగా తప్పుడు ప్రచారం చేయడం సరైన విధానం కాదని అన్నారు. చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉండొచ్చు.. అంతమాత్రాన కొడుకు తల్లికి కాకుండా పోతాడా.. తల్లికి కొడుకు కాకుండా పోతాడా.. అలాగే అన్నకి చెల్లి కాకుండా పోతుందా.. చెల్లికి అన్నకాకుండా పోతాడా అని ఆగ్ర‌హంతో ప్ర‌శ్నించారు. ఇంకోసారి తప్పుడు ప్రచారం చేస్తే పరువు నష్టం దావా వేస్తానంటూ విజ‌య‌మ్మ హెచ్చ‌రించారు. ఇటీవల రాసిన రెండు లేఖలు నేను రాసినవే.. నకిలీ లేఖలు రాయాల్సిన అవసరం నా కొడుక్కి లేదని చెప్పారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే డైరెక్ట్ గా నా కొడుకుతో రాజకీయ పోరాటం చేయండని పేర్కొన్నారు. దీంతో ప్ర‌స్తుతం విజ‌య‌మ్మ వీడియో వైర‌ల్ అవుతోంది.

Also Read: IPL 2025 Auction Venue: ఐపీఎల్ మెగా వేలం వేదిక మార్పు.. వేలంలోకి 16 దేశాలకు చెందిన ఆటగాళ్లు!

అయితే ఇటీవ‌ల టీడీపీ త‌న ఎక్స్ ఖాతాలో గ‌తంలో విజ‌య‌మ్మ‌కు జ‌రిగిన కారు ప్ర‌మాదం విష‌యాన్ని తెర‌పైకి తెచ్చిన విష‌యం తెలిసిందే. అయితే ఈ కారు ప్ర‌మాదానికి కార‌ణం జ‌గ‌నే అన్న‌ట్లు టీడీపీ ఓ క్యాప్ష‌న్ ఇచ్చింది. దీంతో ఈ వివాదం తెర‌పైకి వ‌చ్చింది. అయితే సోమ‌వారం విజ‌య‌మ్మ ఇదే విష‌య‌మై ఓ లేఖ‌ను విడుద‌ల చేశారు. అయితే ఆ లేఖ‌ను కూడా ఫేక్ అని టీడీపీ శ్రేణులు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేశారు. దీంతో విసిగిపోయిన విజ‌య‌మ్మ స్వ‌యంగా ఓ వీడియో విడుద‌ల చేసింది. ఇక‌పోతే ఏపీలో డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ న‌డుస్తున్నాయ‌ని వైసీపీ మొద‌ట్నుంచి ఆరోపిస్తుంది. త‌మది డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ కావ‌ని, మంచి ప్ర‌భుత్వం అని కూట‌మి నేత‌లు చెబుతున్నారు.