Site icon HashtagU Telugu

YS Sharmila : వైఎస్సార్ సీపీ ఆయువుపట్టుపై వైఎస్ షర్మిల ఫోకస్!

Ys Sharmila Rayalaseema Plan

Ys Sharmila Rayalaseema Plan

YS Sharmila : ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ బలోపేతం కోసం వైఎస్ షర్మిల తనదైన శైలిలో వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఈక్రమంలో ఆమె ప్రధానంగా ఓ ప్రాంతంపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. వైఎస్సార్ సీపీకి ఆయువుపట్టుగా ఉన్న ఆ ప్రాంతంలో కాంగ్రెస్ జెండాను ఈసారి ఎలాగైనా ఎగరేయాలనే పట్టుదలతో ముందుకు సాగుతున్నారు.  ఆ ఏరియాలో వైఎస్సార్ సీపీ ఓట్లను సాధ్యమైనంత మేర చీల్చడమే టార్గెట్‌గా అడుగులు వేస్తున్నారు. షర్మిల(YS Sharmila) అంతగా ఫోకస్ పెట్టిన ఆ ప్రాంతమే రాయలసీమ. వివరాలివీ..

We’re now on WhatsApp. Click to Join

రాయలసీమ ఏరియాలోని కడపలో ప్రచారాన్ని ప్రారంభించిన షర్మిల.. తదుపరిగా కర్నూలులోనూ జనంతో మమేకం అయ్యారు.  షర్మిల సభలకు జన ప్రవాహం అంత భారీగా రానప్పటికీ.. కాంగ్రెస్ పార్టీకి కూడా ఇంకా ఆదరణ ఉందనిపించేలా వస్తున్నారు. రాయలసీమతో పాటు కోస్తాలోని బలమైన నియోజకవర్గాలపై ఆమె ప్రత్యేక దృష్టి పెట్టి ప్రచారం చేస్తున్నారు. వైఎస్సార్ సీపీపై గెలవడం అనే లక్ష్యంతో కాకుండా.. ఆ పార్టీని ఓడించడమే టార్గెట్‌గా షర్మిల ఎక్కడికక్కడ వ్యూహరచన చేస్తున్నారు. అందుకే ఇంత తక్కువ టైంలో షర్మిలకు ఏపీ అనూహ్యమైన ప్రజాభిమానం వచ్చింది.  వైఎస్ వివేకా కుమార్తె వైఎస్ సునీత కూడా షర్మిలతో కలిసి ప్రచారంలో పాల్గొంటున్నారు. నామినేషన్ల దాఖలు ప్రక్రియ పూర్తయ్యాక.. షర్మిల రాయలసీమలోనే ఎక్కువగా ప్రచారం చేసే ఛాన్స్ ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఏపీలోని కొన్ని కీలక నియోజకవర్గాలపై ఆమె గురిపెట్టారని చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ నుంచి డైవర్ట్ అయ్యే ప్రతి ఓటు..  కాంగ్రెస్ పార్టీకే పడుతుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ముస్లిం, దళిత ఓటర్లు ఈ సారి కాంగ్రెస్ వైపు మొగ్గే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.  పార్లమెంటులో చాలా బిల్లుల ఆమోదం వేళ బీజేపీ సర్కారుకు వైఎస్ జగన్ మద్దతును ప్రకటించడంతో ముస్లిం, దళిత వర్గం తీవ్ర నిరాశకు గురైనట్లు తెలుస్తోంది. ప్రత్యేకించి షర్మిల, వైఎస్ సునీత ప్రభావంతో రాయలసీమలోని మహిళా ఓటర్లలో చాలామంది కాంగ్రెస్ వైపు మొగ్గుచూపే అవకాశం ఉంది.  ఒకవేళ సోనియాగాంధీ లేదా ప్రియాంకాగాంధీతో రాయలసీమ ప్రాంతంలో ప్రచారం చేయిస్తే హస్తం పార్టీకి మరింత ప్రయోజనం చేకూరుతుందని అంటున్నారు.

Also Read : Healthy Kidney : కిడ్నీలను పనితీరుపై ఉప్పు, చక్కెర ప్రభావం చూపుతాయా..?

ఇప్పటికే నలుగురు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, ఓ కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్‌లో చేరి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగారు. నందికొట్కూరు నుంచి ఆర్థర్, చింతలపూడి నుంచి ఎలీజా, పూతలపట్టు నుంచి ఎంఎస్ బాబు, పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు కాంగ్రెస్ లో చేరారు. కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి .. జగన్ పై తీవ్ర ఆరోపణలు చేసి కాంగ్రెస్ లో చేరి.. టెక్కలి నుంచి పోటీ  చేయడానికి సిద్ధమయ్యారు. ఇలా కనీసం 30 నుంచి 40 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ బలమైన అభ్యర్థుల్ని నిలబెడుతోంది. కీలకమైన స్థానాల్లో కనీసం 10వేల నుంచి 15వేల ఓట్లను చీలిస్తే పోటీలో ఉన్న కొంత మంది  వైఎస్సార్ సీపీ అభ్యర్థులు ఓడిపోతారనే అంచనాలు ఉన్నాయి. షర్మిలకు కావాల్సింది  కూడా అదే.  ఏపీ కాంగ్రెస్‌లో  కేవీపీ రామచంద్రరావు, రఘువీరారెడ్డి లాంటి వాళ్లు  బయట పెద్దగా కనిపించడం లేదు. కానీ తెర వెనుక మాత్రం చురుగ్గా వ్యవహరిస్తున్నారు. వైసీపీలో అసంతృప్తికి గురైన నేతల్ని సంప్రదించి, కాంగ్రెస్ తరఫున పోటీకి ఒప్పిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాలున్న కర్ణాటక,తెలంగాణ నుంచి ఏపీ కాంగ్రెస్ పార్టీకి సాయం అందుతోంది.  తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విశాఖ బహిరంగసభలోనూ ప్రసంగించారు. వైఎస్ షర్మిల వ్యూహాలు ఎంతమేరకు ఫలిస్తాయో తెలియాలంటే.. ఫలితాలు వచ్చేదాకా వేచిచూడాల్సిందే.

Also Read :Pet Care : వేసవిలో పెంపుడు కుక్కల కోసం 5 చిట్కాలు..!