Site icon HashtagU Telugu

YS Sharmila Assets: జగన్ కి షర్మిల 100 కోట్ల అప్పు…వైఎస్ భారతి ఎంత అప్పు ఇచ్చిందో తెలుసా..?

YS Sharmila Assets

YS Sharmila Assets

YS Sharmila Assets: ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్, ఆయన చెల్లెలు షర్మిల రాజకీయ ప్రత్యర్థులుగా మారారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తానని పోటీ చేయకుండానే తప్పుకున్న షర్మిల ఏపీ రాజకీయాల్లో మాత్రం క్రీయాశీలకంగా వ్యవహరిస్తున్నారు. షర్మిలకు కాంగ్రెస్ హైకమాండ్ ఏపీసీసీ పగ్గాలు అప్పజెప్పిన నాటి నుండి ఆమె తన అన్న, సీఎం జగన్ పై ఆరోపణలు చేయడం ప్రారంభించారు. జగన్ అన్న పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నారని, ఎప్పుడూ ప్రజల మధ్యకు రారని, రాష్ట్రాన్ని అడ్డగోలుగా గాలికి వదిలేశాడని ఆరోపణలు చేస్తూ వచ్చారు షర్మిల. కాగా వారి మధ్య ఆస్తుల వివాదం ఉన్నదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో జగన్ నుంచి భారీగా అప్పు తీసుకున్నట్లుగా షర్మిల ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది.

ఏపీసీసీ అధ్యక్షురాలు, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్‌ షర్మిల వచ్చే ఎన్నికలకు ముందు సమర్పించిన అఫిడవిట్‌లో తన ఆస్తుల విలువ రూ.182.82 కోట్లుగా చూపించారు. అయితే తన సోదరుడు, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వద్ద షర్మిల రూ.82,58,15,000 కోట్ల రుణం తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు. వైఎస్ భారతిరెడ్డి వద్ద అదనంగా రూ.19,56,682 రుణం తీసుకున్నానని ఆమె తన డిక్లరేషన్‌లో వెల్లడించింది.

We’re now on WhatsAppClick to Join

షర్మిల రూ. 97,14,213 ఆదాయాన్ని నివేదించగా, ఆమె భర్త అనిల్ కుమార్ రూ.3,00,261 ఆదాయాన్ని ప్రకటించారు. షర్మిల చరాస్తులు రూ.123,26,65,163 కాగా, ఆమె భర్త అనిల్ కుమార్ రూ.45,19,72,529 కోట్ల చరాస్తులను కలిగి ఉన్నారు. అదనంగా వారి స్థిరాస్తులు వరుసగా రూ.9,29,58,180 మరియు రూ.4,05,92,365గా ఉన్నాయి. షర్మిల వెల్లడించిన మొత్తం అప్పులు రూ.82,77,71,682 కాగా, ఆమె భర్తకు రూ.35,81,19,299 అప్పులు ఉన్నాయని వెల్లడించార. ఇక షర్మిల వద్ద రూ.3,69,36,000 విలువైన బంగారు ఆభరణాలు, రూ.4,61,90,688 విలువైన రత్నాభరణాలు ఉన్నాయి. విద్యకు సంబంధించి, తాను సెయింట్ అన్నా కాలేజ్ ఫర్ ఉమెన్ నుండి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ డిగ్రీని పొందానని మరియు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి MBA చదివానని షర్మిల ప్రకటించారు. మోడల్ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలతో సహా ఆమెపై ఎనిమిది పెండింగ్ క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఆమె వెల్లడించింది.

Also Read: Lokam Madhavi Assets: జనసేన అభ్యర్థి లోకం మాధవి ఆస్తి 894 కోట్లా..?