YS Sharmila: అన్నపై షర్మిల తొలి అడుగు నేడే

వైఎస్ కుటుంబానికి కడప కంచుకోట. ఆ ప్రాంతంలోని పులివెందుల నియోజకవర్గం నుంచి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పోటీ చేశారు. ఆయన మరణాంతరం కుమారుడు, ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్ పులివెందుల నుంచి పోటీ చేశారు. మరోవైపు కడప ఎంపీగా కజిన్ వైఎస్ అవినాష్ రెడ్డి ఎంపీగా కొనసాగుతున్నారు.

YS Sharmila: వైఎస్ కుటుంబానికి కడప కంచుకోట. ఆ ప్రాంతంలోని పులివెందుల నియోజకవర్గం నుంచి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పోటీ చేశారు. ఆయన మరణాంతరం కుమారుడు, ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్ పులివెందుల నుంచి పోటీ చేశారు. మరోవైపు కడప ఎంపీగా కజిన్ వైఎస్ అవినాష్ రెడ్డి ఎంపీగా కొనసాగుతున్నారు. వాస్తవానికి ఆ ప్రాంత ప్రజలు వైఎస్ కుటుంబాన్ని అమితంగా ఆరాధిస్తారు. రాజకీయంగా వాళ్ళకే పట్టం కడతారు. ఆ ప్రాంతంలో వైఎస్ కుటుంబంపై పోటీ చేయడానికి ఇతరులు వెనకడుతారు. అయితే ఇప్పుడు అదే ప్రాంతం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఆమె కాంగ్రెస్ పార్టీ తరుపున కడప నుంచి లోకసభ స్థానానికి పోటీకి దిగనున్నారు. దీంతో కడప రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.

కడపలో వైఎస్ షర్మిల ఈ రోజు తొలిసారి పర్యటనకు సిద్ధమయ్యారు. ఈరోజు నుంచి బస్సుయాత్ర ద్వారా ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. కడప పార్లమెంట్ నియోజకవర్గం ఎంపీ అభ్యర్థిగా ఆమె ప్రచారంలో పాల్గొననున్నారు. తొలిరోజు ప్రచారం బద్వేల్ డివిజన్‌లోని 7 మండలాల్లో నిర్వహించనున్నారు. ప్రచార సమయంలో షర్మిల తన ప్రసంగంలో సీఎం జగన్‌ను, వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్‌రెడ్డిని టార్గెట్ చేసే అవకాశం ఉంది.

We’re now on WhatsApp : Click to Join

అంతకుముందు వైఎస్ షర్మిల కడప నుంచి తన ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. దేవుడి దీవెనలు, తన తండ్రి, తల్లి దీవెనలు తీసుకున్నారు.కడప ఎంపీగా గెలుపొందేందుకు షర్మిల ఈ యాత్రకు శ్రీకారం చుట్టడంతో ప్రజల మద్దతు, ఆశీస్సులు కోరుతూ నేటి నుంచి ప్రజాపోరాట యాత్ర ప్రారంభం కానుంది.

వైఎస్ షర్మిల కడప షెడ్యూల్:
5వ తేదీ: కాశీనాయన, కలసపాడు, పోరుమామిళ్ల, బి. కోడూరు, గోపవరం
6వ తేదీ: బద్వేల్, అట్లూరు, కడప
7వ తేదీ: దువ్వూరు, చాపాడు, ఖాజీపేట, మైదుకూరు, బి. మఠం
8వ తేదీ: కమలాపురం, వల్లూరు చెన్నూరు, చింతకొమ్మదిన్నె, పెండ్లిమర్రి, వీరపునాయిని పల్లి
10వ తేదీ: చక్రాయపేట, వేంపల్లి, వేముల, పులివెందుల, సింహాద్రిపురం, లింగాల
11వ తేదీ: తొండూరు, ఎర్రగుంట్ల, కొండాపురం, ముద్దనూరు, మైలవరం
12వ తేదీ: జమ్మలమడుగు, పెద్దముడియం, ప్రొద్దుటూరు, రాజుపాలెం

Also Read: Diabetic Summer Drinks: ఈ వేస‌విలో షుగ‌ర్ పేషెంట్స్ తీసుకోవాల్సిన డ్రింక్స్ ఇవే..!