Lokesh – Sharmila : నారా ఫ్యామిలీకి వైఎస్ షర్మిల క్రిస్మస్ గ్రీటింగ్స్

Lokesh - Sharmila : క్రిస్మస్ పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.

Published By: HashtagU Telugu Desk
Lokesh Sharmila

Lokesh Sharmila

Lokesh – Sharmila : క్రిస్మస్ పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌‌కు వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల క్రిస్మస్‌ గ్రీటింగ్స్ పంపారు. దీనిపై స్పందించిన నారా లోకేశ్‌ ట్వీట్‌ చేస్తూ షర్మిలకు కృతజ్ఞతలు తెలిపారు. నారా కుటుంబం తరఫున షర్మిలకు క్రిస్మస్‌, న్యూ ఇయర్ గ్రీటింగ్స్ చెప్పారు. ‘అద్భుతమైన క్రిస్మస్ కానుకలు పంపినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నారా కుటుంబం మీకు, మీ కుటుంబసభ్యులకు క్రిస్మస్, న్యూఇయర్ శుభాకాంక్షలు తెలియజేస్తుంది’ అంటూ ట్విట్టర్ వేదికగా రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్, ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుటుంబానికి సైతం వైఎస్ ఫ్యామిలీ తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు చెబుతూ క్రిస్మస్ స్పెషల్ గ్రీటింగ్స్‌ను షర్మిల (Lokesh – Sharmila) పంపించారు. ఈ మేరకు ‘వైఎస్ఆర్ కుటుంబం మీకు శుభాకాంక్షలు తెలుపుతోంది. ఈ క్రిస్మస్ ఆనందమయంగా సాగిపోవాలి. మీకు 2024లో అంతా శుభం కలగాలి’ అని ఆ గ్రీటింగ్ బాక్స్‌పై రాసి ఉంది.  షర్మిలా సోషల్ మీడియాలోనూ ఈ విషయాన్ని షేర్ చేశారు.

Also Read: Job Skills : జాబ్ స్కిల్స్‌లో తెలంగాణ, ఏపీ ర్యాంకింగ్స్ ఎంతో తెలుసా ?

తమ మధ్య రాజకీయ వైరమే తప్ప.. వ్యక్తిగతంగా ఎలాంటి కక్షలు లేవని నిరూపిస్తూ వైఎస్ షర్మిల, నారా లోకేష్‌లు ఇరువురి పార్టీ వర్గాలు, అభిమానులతో పాటు జనాలను ఆశ్చర్యపరిచారు. రానున్న రోజుల్లో ఏపీ రాజకీయాల్లోకి షర్మిల ఎంట్రీ ఇస్తారనే అంచనాలకు బలం ఇచ్చేలా ఈ పరిణామం ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ షర్మిల సేవలను ఏపీలో వాడుకొని ఆమెకు ఏదైనా నామినేటెడ్ పదవిని కేటాయించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ఇంకా నాలుగు నెలలు టైం ఉన్నందున ఆలోగా ఏదైనా జరగొచ్చని పరిశీలకులు అంటున్నారు.

  Last Updated: 25 Dec 2023, 07:46 AM IST