YS Sharmila: అన్నకు పోటీగా చెల్లి.. ష‌ర్మిల సై అంటే తెలంగాణ‌, ఏపీల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ‌వైభ‌వం

ష‌ర్మిల‌ను ఏపీ రాజ‌కీయాల్లో క్రియాశీల‌కంగా మార్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం ప్ర‌య‌త్నాలు చేస్తోన్న‌ట్లు స‌మాచారం. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకును ప్ర‌స్తుత సీఎం, వైఎస్ఆర్ సీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి త‌న‌వైపుకు తిప్పుకున్నాడు.

  • Written By:
  • Updated On - May 29, 2023 / 08:54 PM IST

ఎన్నిక‌ల స‌మ‌యంలో ముంచుకొస్తోంది. తెలంగాణ‌(Telangana)లో ఈ ఏడాది చివ‌రి నాటికి, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌(Andhra Pradesh) రాష్ట్రంలో వ‌చ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నిక‌లు(Elections) జ‌ర‌గాల్సి ఉంది. ఈ క్ర‌మంలో అన్ని పార్టీలు వ్యూహాల‌కు ప‌దును పెట్టాయి. ముఖ్యంగా తెలంగాణ‌లో అధికార పార్టీ బీఆర్ఎస్‌(BRS)ను ఓడించి గ‌ద్దెనెక్కేందుకు కాంగ్రెస్ దూకుడుగా ముందుకెళ్తుంది. టీపీసీసీ(TPCC) ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి(Revanth Reddy)తో పాటు ఇత‌ర నేత‌లు పాద‌యాత్ర‌లు, స‌భ‌ల‌తో పార్టీ శ్రేణుల్లో నూత‌నోత్సాహాన్ని నింపుతున్నారు. అయితే, తెలంగాణ‌లో వైఎస్ఆర్‌టీపీ పేరుతో దివంగ‌త వైఎస్ఆర్ కుమార్తె ష‌ర్మిల(YS Sharmila) ప్ర‌జ‌ల్లోకి వెళ్తున్నారు. ష‌ర్మిల పార్టీ ద్వారా కాంగ్రెస్ క్యాడ‌ర్‌లో కొంత‌మేర చీలిక వ‌చ్చే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఆ పార్టీ అధిష్టానం అంచ‌నా వేస్తుంది. తెలంగాణ‌లో కేసీఆర్ ప్ర‌భుత్వాన్ని గ‌ద్దెదింపే ల‌క్ష్యంగా ష‌ర్మిల ముందుకెళ్తున్నా.. ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్లే చీలుతాయ‌ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం బావిస్తుంది.

ష‌ర్మిల నుంచి ఎదుర‌య్యే న‌ష్టానికి చెక్ పెట్ట‌డం ద్వారా ఇటు తెలంగాణ‌లో, ఏపీలోనూ కాంగ్రెస్ కు పూర్వ‌వైభ‌వం తీసుకురావ‌చ్చొని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది. ఈ క్ర‌మంలో ష‌ర్మిలతో కాంగ్రెస్ పార్టీ నేత‌లు ట‌చ్‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ కీల‌క నేత ప్రియాంక గాంధీకూడా ష‌ర్మిల‌తో మాట్లాడిన‌ట్లు స‌మాచారం. వైఎస్ఆర్టీపీ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయ‌డం ద్వారా తెలంగాణ‌లో, ఏపీలో కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గిస్తామ‌ని ష‌ర్మిల‌కు కాంగ్రెస్ హామీ ఇచ్చిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది. క‌ర్ణాట‌క డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్ ద్వారా ష‌ర్మిల‌ను ఒప్పించే ప్ర‌య‌త్నాల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిమ‌గ్న‌మైన‌ట్లు క‌నిపిస్తోంది. ఈ ప్ర‌క్రియ‌లో భాగంగానే ష‌ర్మిల సోమ‌వారం డీకే శివ‌కుమార్ తో భేటీ అయిన‌ట్లు స‌మాచారం. అయితే, కాంగ్రెస్ ప్ర‌తిపాద‌న‌కు ష‌ర్మిల అంగీక‌రించే అవ‌కాశం క‌నిపించ‌డం లేదు.

ష‌ర్మిల‌ను ఏపీ రాజ‌కీయాల్లో క్రియాశీల‌కంగా మార్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం ప్ర‌య‌త్నాలు చేస్తోన్న‌ట్లు స‌మాచారం. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకును ప్ర‌స్తుత సీఎం, వైఎస్ఆర్ సీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి త‌న‌వైపుకు తిప్పుకున్నాడు. దీంతో ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉనికి కోల్పోయింది. ఏపీలో మ‌ళ్లీ కాంగ్రెస్ కు పూర్వ‌వైభవం రావాలంటే జ‌గ‌న్ ను దెబ్బ‌కొడితే కానీ సాధ్యం కాద‌ని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది. వైఎస్ఆర్ వార‌స‌త్వంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ష‌ర్మిల‌ను ఏపీ రాజ‌కీయాల్లోకి దింప‌డం ద్వారా త‌మ వ్యూహం ఫ‌లిస్తుంద‌న్న భావ‌న‌లో కాంగ్రెస్ పార్టీ పెద్ద‌లు ఉన్నారు.

Also Read : Malreddy Ram Reddy Arrest: కాంగ్రెస్ నేత మల్ రెడ్డి రాంరెడ్డి అరెస్ట్

ష‌ర్మిల మాత్రం వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు ఏమాత్రం సుముఖంగా లేదు. ఒక‌వేళ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవ‌టం ద్వారా ఆ పార్టీతో క‌లిసి ప‌నిచేసే అవ‌కాశాలు లేక‌పోలేదు. కాంగ్రెస్ పార్టీతో ష‌ర్మిల జ‌త‌క‌ట్టి.. కాంగ్రెస్ అధిష్టానం వ్యూహం ప‌క్కాగా అమ‌లైతే ఒకే దెబ్బ‌కు రెండు పిట్ట‌లు అన్న‌ట్లు తెలంగాణ‌లో కాంగ్రెస్ అధికారంలోకి రావ‌డంతో పాటు ఏపీలో కాంగ్రెస్ పార్టీ బ‌లోపేతం అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి.

 

Also Read : YS Sharmila: డీకేతో భేటీ అయిన షర్మిల.. డీల్ ఫిక్స్ అయినట్టేనా?