Site icon HashtagU Telugu

YS Sharmila : వైస్సార్ శ్రేణులకు షర్మిల భారీ లేఖ

Sharmila Letter To Fans

Sharmila Letter To Fans

APCC అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila).. వైస్సార్ అభిమానులకు (YS fans) 3 పేజీల బహిరంగ లేఖ (YS Sharmila Letter) రాశారు. ఈరోజు పొద్దున సాక్షి పేపర్ చేశా.. సాక్షి మీడియా జగన్ చేతిలో ఉండడం తో ప్రజలను ఏదైనా నమ్మించగలడు. అయినా వైస్సార్ అభిమానులకు అసలు వాస్తవాలు తెలియజేసే ప్రయత్నం నాపై ఉందన్నారు. అమ్మ వైఎస్ విజయమ్మ గారు, నాన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి గురించి ఒక పుస్తకం రాశారు.

అందులో నాన్న గురించి ప్రత్యేకంగా ఒక మాట రాశారు. “రాజశేఖర్ రెడ్డి గారికి లోకం అంతా ఒకెత్తయితే”, తన బిడ్డ షర్మిల ఒకెత్తు అని రాశారని వెల్లడించారు. నాన్నకు నేనంటే ప్రాణం. నాన్న నన్ను ఎప్పుడూ ఆడపిల్ల కదా అని చిన్న చేసో, తక్కువ చేసో చూడలేదు. నాన్న బ్రతికి ఉన్నన్ని రోజులు ఒకే మాట అనేవారు. “నా నలుగురు గ్రాండ్ చిల్డ్రన్ నాకు సమానం”. వైఎస్ఆర్ గారు బ్రతికి ఉండగా స్థాపించిన అన్ని కుటుంబ వ్యాపారాల్లో, నలుగురు గ్రాండ్ చిల్డ్రన్ కి సమాన వాటా ఉండాలి.

రాజశేఖర్ రెడ్డి గారు ఉండగా స్థాపించిన అన్ని వ్యాపారాలు కుటుంబ వ్యాపారాలే. అవి జగన్ సొంతం కాదు.. ఉన్న అన్ని కుటుంబ వ్యాపారాలకు జగన్ గారు “గార్డియన్ ” మాత్రమే. అన్నీ వ్యాపారాలు నలుగురు చిన్న బిడ్డలకు సమానంగా పంచి పెట్టలనేది జగన్ బాధ్యత. ఇది రాజశేఖర్ రెడ్డి గారి మేండేట్. వైఎస్ఆర్ ఈ ఉద్దేశ్యాన్ని ఆయన బిడ్డలమైన మాకు, ఆయన భార్యకు, సన్నిహితులందరికి,స్పష్టంగా తెలిసిన విషయం అన్నారు. ఇంకా ఏమున్నదో ఈ కింది లింక్ లో చూడొచ్చు.

Read Also : AP Free Gas Cylinders: ఉచిత గ్యాస్ సీలిండర్లపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన..