Site icon HashtagU Telugu

Sharmila Letter to Modi : ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలంటూ మోడీకి షర్మిల లేఖ

Sharmila Letter To Modi

Sharmila Letter To Modi

ఏపీసీసీ చీఫ్ వైస్ షర్మిల (Sharmila )..ప్రధాని మోడీ (PM Modi)కి లేఖ రాసారు. ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అధికార పార్టీ తో పాటు ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రచారానికి సిద్ధం అయ్యాయి. ఇప్పటికే టీడీపీ , వైసీపీ తమ ప్రచారాన్ని మొదలుపెట్టగా..బిజెపి , జనసేన లు వచ్చే నెల నుండి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నాయి. ఇక ఏపీసీసీ చీఫ్ గా బాధ్యత చేపట్టిన షర్మిల..రాష్ట్రంలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకరావాలని కంకణం కట్టుకుంది. ఇప్పటికే ఉత్తరాంధ్ర పర్యటన చేస్తున్న ఈమె..వరుస గా పార్టీ నేతలతో సమావేశం అవుతూ..పదేళ్ల లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని , ముఖ్యంగా ఈ ఐదేళ్లలో రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా మారిందని..జగన్ ఫై విమర్శలు చేస్తూ వస్తున్నారు.

ఇదే తరుణంలో ఏపీ ప్రత్యేక హోదా అంశాన్ని మరోసారి జనాల్లోకి తీసుకెళ్తుంది. తాజాగా ఈ విషయంపై ప్రధాని మోడీకి లేఖ రాసారు. ఏపీకి సంబంధించిన పలు అంశాలను ప్రస్తావిస్తూ, వాటిని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి షర్మిల లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లో పేర్కొన్న అపరిష్కృత వాగ్దానాలపై మీ దృష్టికి తీసుకువస్తున్నానంటూ లేఖలో షర్మిల పేర్కొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

కేంద్రం విభజన హామీల విషయంలో ఎలా మోసం చేసిందనడానికి ప్రత్యేకహోదా అనేది ముఖ్యమైన ఉదాహరణగా కనపిస్తోందన్నారు. ప్రత్యేకహోదా ఇవ్వకపోవడం వల్ల ఏపీ ఇతర రాష్ట్రాలతో పోటీ పడలేకపోతోందని తెలిపారు. లెవర్ ప్లేయింగ్ ఫీల్డ్ ను ఏర్పాటు చేయడానికి ఏపీకి తక్షణం ప్రత్యేకహోదా కావాలన్నారు. అలాగే ప్రత్యేకహోదా అంత ప్రాధాన్యత కల పోలవరం ప్రాజెక్టు విషయంలోనూ కేంద్రం సరైన సహకారం అందించడం లేదన్నారు. ఐదేళ్లుగా ప్రాజెక్టు నిర్మాణం ఆగిపోయిందన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు భవితవ్యం ప్రమాదంలో పడిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఐదున్నర కోట్ల మంది ఆంధ్ర ప్రదేశ్ ప్రజల తరపున తాను లేఖ రాస్తున్నానని.. తక్షణం విభజన హామీలను నెరవేర్చాలని కోరారు.

రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన వాగ్దానాలు చాలా ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రాజెక్టు జాతీయ హోదాను నీరుగార్చేశాయి. ఫలితంగా నేడు పోలవరం ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని షర్మిల అన్నారు. ప్రభుత్వాలుకూడా ప్రాజెక్టు వ్యయాన్ని తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయని తెలుస్తోంది. ఇదేజరిగితే ప్రాజెక్టు లక్ష్యాన్ని నాశనం చేసినట్లేనని ప్రధానికి రాసిన లేఖలో షర్మిల పేర్కొన్నారు. ఈ అంశాలను 5.5కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున తాము విజ్ఞప్తిని చేస్తున్నామని, ఈ విషయాలను సీరియస్ గా పరిగణలోకి తీసుకొని ఈ వాగ్దాలను నెరవేర్చాలని షర్మిల లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రానికే గర్వకారణంగా, నగరానికి ప్రతీకగా నిలిచిన వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలన్న మీ ప్రభుత్వ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని విజ్ఞప్తి చేస్తున్నామని షర్మిల లేఖలో ప్రస్తావించారు.

Read Also : Tasty Teja Heart Attack : బిగ్ బాస్ ఫేమ్ టేస్టీ తేజ కు హార్ట్ ఎటాక్..ఆ తర్వాత ఏంజరిగిందంటే..!!