Site icon HashtagU Telugu

YS Sharmila : వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలంటూ షర్మిల డిమాండ్

Sharmila Jagan

Sharmila Jagan

అసెంబ్లీ (AP Assembly)కి వెళ్లని జగన్ (Jagan), ఆయన ఎమ్మెల్యేలు(YCP MLAS) వెంటనే రాజీనామా (Resign ) చేయాలంటూ APPCC చీఫ్ షర్మిల్ (YS Sharmila) డిమాండ్ చేస్తూ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. గడిచిన ఐదేళ్ల వైసీపీ పాలనా ఫై సీఎం చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేస్తూ విమర్శలు కురిపిస్తున్నారు. అయితే జగన్ మాత్రం అసెంబ్లీకి వెళ్లకుండా తన క్యాంపు ఆఫీస్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి అధికార పార్టీ ఫై ఆరోపణలు చేస్తున్నారు. సీఎం చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నాడని..ప్రభుత్వం ఏర్పాటు నెలలు కావొస్తున్నా ఇంకా పూర్తి బడ్జెట్ ప్రవేశ పెట్టలేదని..అబద్దపు అప్పులు చూపిస్తున్నారని జగన్ విమర్శలు చేస్తున్నారు. కాగా వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకపోవడం ఫై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైస్ షర్మిల విమర్శలు కురిపించారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగుపెడతా అనడం జగన్ అజ్ఞానానికి నిదర్శనమని వైఎస్ షర్మిల అన్నారు. అంతకుమించిన పిరికితనం, చేతకానితనం, అహంకారం ఎక్కడా కనపడవు, వినపడవని మండిపడ్డారు. అసెంబ్లీకి పోకుండా ప్రజాస్వామ్యాన్ని హేళన చేస్తున్నారని, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

ఎమ్మెల్యేగా గెలిచింది చట్టసభల్లో ప్రజల గొంతుక అవ్వడానికా, లేక మీడియా ముందు సొంత డబ్బా కొట్టుకోవడానికా? ఐదేళ్ల పాలన అంతా అవినీతి, దోపిడి అని… రాష్ట్రాన్ని మీరు అప్పుల కుప్ప చేసి పెట్టారని… నిండు సభలో అధికార పక్షం శ్వేతపత్రాలు విడుదల చేస్తుంటే… తాపిగా ప్యాలస్ లో కూర్చుని మీడియా మీట్ లు పెట్టడానికి కాదు ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేను చేసింది. గత మీ పాలనపై విమర్శలకు, అసెంబ్లీలో ఆన్ రికార్డు సమాధానం ఇచ్చుకునే బాధ్యత మీది కాదా..? ప్రజలకు అన్యాయం జరిగితే అధికార పక్షాన్ని ఫ్లోర్ అఫ్ ది హౌస్ లో ప్రశ్నించే బాధ్యత మీది కాదా? అసెంబ్లీకి పోనని చెప్పే మీరు, ప్రతిపక్ష హోదాకే కాదు, ఎమ్మెల్యే హోదాకు కూడా అర్హులు కారు. వెంటనే రాజీనామా చేయండి!! బడికి పోను అనే పిల్లోడికి టీసీ ఇచ్చి ఇంటికి పంపిస్తారు, ఆఫీసుకు పోననే పనిదొంగను వెంటనే పనిలోంచి పీకేస్తారు. ప్రజాతీర్పును గౌరవించకుండా, అసెంబ్లీకి పోను అంటూ గౌరవ సభను అవమానించిన వాళ్లకు ఎమ్మెల్యేగా ఉండే అర్హత లేదు. ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పోనప్పుడు మీరు ఆఫ్రికా అడవులకు పోతారో, అంటార్టికా మంచులోకే పోతారో ఎవడికి కావాలి అప్పుడు. అసెంబ్లీకి పోని జగన్ అండ్ కో తక్షణం మీ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.” అని ఫైర్ అయ్యారు.

షర్మిల వ్యాఖ్యలకు వైసీపీ కౌంటర్ ఇచ్చింది. ప్రతిపక్షంలో ఉండి మరో ప్రతిపక్షాన్ని తిడుతున్న షర్మిలకు ప్రజా సమస్యలు కనిపించవని విమర్శించింది. ఆమె ట్వీట్ చంద్రబాబు నుంచి వచ్చిందో లేక తెలంగాణాలోని ఆయన ఏజెంట్ (రేవంత్ రెడ్డి) దగ్గర్నుంచి వచ్చిందోనని ఎద్దేవా చేసింది. తెలంగాణలో మాయమాటలు చెప్పి పారిపోయి ఆంధ్రప్రదేశ్కి వచ్చిన షర్మిల కంటే స్వార్థపరులు ఉంటారా అని ప్రశ్నించింది.

Read Also : Curd in Rainy Season: వర్షాకాలంలో పెరుగు తినొచ్చా.. తింటే లాభాల కంటే స‌మ‌స్య‌లే ఎక్కువ వ‌స్తాయా..?