Site icon HashtagU Telugu

YS Sharmila : జగన్ పులి కాదు.. బీజేపీ ముంగిట పిల్లి – షర్మిల

Sharmila Jagan Cat

Sharmila Jagan Cat

వైసీపీ అధినేత , ఏపీ సీఎం , తన అన్న జగన్ (Jagan) ఫై వైస్ షర్మిల (YS Sharmila) తన దూకుడు ను తగ్గించడం లేదు..ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన దగ్గరి నుండి వైసీపీ ప్రభుత్వం ఫై విమర్శలు , ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంది. ప్రస్తుతం జిల్లాల పర్యటన లో బిజీ గా ఉంటూ..మళ్లీ రాష్ట్రంలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తుంది. ఓ పక్క అధికార పార్టీ వైసీపీ ఫై విమర్శలు చేస్తూనే..మరోపక్క కాంగ్రెస్ నేతల్లో ఉత్సాహం నింపుతుంది.

We’re now on WhatsApp. Click to Join.

శనివారం అల్లూరి జిల్లా పాడేరు నియోజకవర్గం చింతపల్లిలో వైఎస్ షర్మిల బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభ వేదికగా మరోసారి వైసీపీ సర్కార్ ఫై , జగన్ ఫై విమర్శల వర్షం కురిపించింది. సీఎం జగన్ పులి కాదని.. బీజేపీ ముంగిట పిల్లిలా మారారని షర్మిల ఎద్దేవా చేశారు. ‘బీజేపీ గుప్పిట్లో జగన్ చిక్కుకున్నారు. ప్రత్యేకహోదా కోసం ఆయన ఎప్పుడైనా నిజమైన పోరాటం చేశారా? 25 వేల పోస్టులతో DSC అన్నారు. ఇప్పుడు తూతూమంత్రంగా ఎన్నికల ముంగిట DSC ప్రకటించారు. కేంద్రంలో కాంగ్రెస్ వస్తేనే రాష్ట్రానికి ప్రత్యేకహోదా, పోలవరం, రాజధాని సాధ్యం’ అని ఆమె పేర్కొన్నారు. అలాగే టీడీపీపైనా షర్మిల విమర్శనాస్త్రాలు సంధించారు. బ్రిటిష్ వాళ్ళను తరిమి తరిమి కొట్టిన వీరుడు మన్యందొర అల్లూరి సీతారామరాజు స్ఫూర్తిగా.. అల్లూరి బ్రిటీష్ వాళ్లను తరిమికొట్టినట్లు, నియంతలను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.

వైఎస్ఆర్ హయాంలో 20 లక్షల ఎకరాలకు పోడుపట్టాలు ఇచ్చామని, వాటి ద్వారా రైతులు లోన్లు కూడా తీసుకున్నట్లు షర్మిల గుర్తుచేశారు. వైఎస్ఆర్ హయాంలో వేసిన రోడ్లే ఇప్పటికీ దిక్కు అన్న షర్మిల.. ఇప్పటి ప్రభుత్వాలకు బాక్సైట్ తవ్వకాల మీద ఉన్న శ్రద్ధ గిరిజనుల అభివృద్ధి మీద లేదని విమర్శించారు. జగనన్న 25 ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తామన్నారనీ.. కానీ అధికారంలోకి వచ్చాక చేతకాలేదని తప్పుబట్టారు. ఎన్నికలప్పుడు ఏ పార్టీ డబ్బులు ఇచ్చినా తీసుకోవాలన్న షర్మిల.. అవి మీడబ్బులే. ఇసుక, బాక్సైట్‌, లిక్కర్‌ మాఫియాతో సంపాదించిన డబ్బులే.. కానీ, ఓటు మాత్రం ఆలోచించి వేయండని ప్రజలను కోరింది.

Read Also : Telangana Budget 2024: కాంగ్రెస్ బడ్జెట్ పై కేటీఆర్ పంచులు