Site icon HashtagU Telugu

YS Sharmila : ఢిల్లీలో వరుసగా నేతలను కలుస్తున్న షర్మిల..

Sharmila Meets Sharath

Sharmila Meets Sharath

APCC చీఫ్ వైస్ షర్మిల (YS Sharmila) ఢిల్లీ (Delhi) లో వరుసగా నేతలను కలుస్తూ బిజీ అయ్యారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన నాటినుంచి పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపేందుకు షర్మిల ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే జిల్లాల వారిగా కాంగ్రెస్ పార్టీ సమీక్షల్లో పాల్గొన్న షర్మిల.. అధికార పార్టీ వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూనే.. ప్రత్యేక హోదా (AP Special Status), పోలవరం ప్రాజెక్టుల, విభజన చట్టంలోని హామీల అమలు వంటి అంశాలను ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్తున్నారు. ఇప్పటికే ఈ అంశాలపై ప్రధాని మోడీకి లేఖ రాసిన షర్మిల..మరికాసేపట్లో ఢిల్లీ ఏపీ భవన్ వద్ద ధర్నా చేయబోతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ తరుణంలో ఉదయం నుండి వరుసగా అన్ని పార్టీల నేతలను కలుస్తూ..ధర్నా కు మద్దతు తెలుపాలని, ఏపీకి ప్రత్యేక హోదా కల్పించడంలో భాగం కావాలని కోరుతుంది. ఉదయం ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌తో సమావేశమయ్యారు. కేంద్రం ప్రభుత్వం ఏపీకి చేస్తున్న అన్యాయాన్ని వివరించారు. విభజన హామీలు నెరవేర్చకుండా దాటవేత ధోరణితో ఉందని తెలిపారు. దీనిపై పోరాడేందుకు సిద్ధమయ్యామని సహకరించాలని విజ్ఞప్తి చేశారు. శరద్‌ పవార్‌ (Sharad Pawar
)తో సమావేశం అనంతరం డీఎంకే ఎంపీ తిరుచి శివతో సమావేశమయ్యారు షర్మిల. ఏపీలో ఉన్న పరిస్థితులు తెలిపారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని కేంద్రంపై చేస్తున్న పోరాటంలో మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు. వాళ్లతోనే కాకుండా సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో సమావేశం అయ్యారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఏపీ భవన్ వద్ద షర్మిల దీక్ష చేపట్టనున్నారు. దీక్ష అనంతరం సాయంత్ర నాలుగు గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశంకానున్నారు.

Read Also : Vallabhaneni Vamsi : ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి అరెస్టు వారెంట్..