మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు(YS Murder) విచారణ క్లైమాక్స్ కు చేరింది. ఎంపీ అవినాష్ రెడ్డి(Avinash Reddy) తండ్రి భాస్కర్ రెడ్డిని కడప జైలులోని విశ్రాంతి మందిరంలో సీబీఐ విచారణ చేస్తోంది. హత్య జరిగిన రోజు అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, సునీల్ యాదవ్, గంగిరెడ్డి ఒకేచోట ఉన్నారని గుగూల్ టేక్ ఔట్ చెబుతోంది. దాని ప్రకారం విచారణ చేస్తోన్న సీబీఐ సుదీర్ఘంగా అవినాష్ రెడ్డి శుక్రవారం విచారించింది. ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిని శనివారం కడపకు వెళ్లిన సీబీఐ అధికారులు విచారణ చేస్తున్నారు. గత ఎన్నికల సందర్భంగా సంచలనం సృష్టించిన ఈ కేసు మలుపులు తిరుగుతూ వస్తోంది. కొన్ని వందల మందిని సీబీఐ విచారణ చేసింది. చివరకు ఎంపీ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి వద్ద ఆగింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు(YS Murder)
వారం రోజుల క్రితం ఇదే కేసు విచారణ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి భార్య భారతి రెడ్డి పీఏ నవీన్ , జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిని కడపలో సీబీఐ విచారించింది. హత్య(YS Murder) జరిగిన రోజు ఎవరెవరికి ఎంపీ అవినాష్ నుంచి ఫోన్ కాల్స్ వెళ్లాయి? అనేదానిపై విచారణాధికారులు దృష్టి పెట్టారు. కాల్ డేటాను పూర్తిగా విశ్లేషణ చేసిన తరువాత అవినాష్ (Avinash Reddy)ను రెండోసారి శుక్రవారం విచారణ చేశారు. ఇప్పుడు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిని కూడా విచారణ చేస్తున్నారు. దీంతో కేసు విచారణ ఒక కొలిక్కి వస్తుందని వివేకా కుమార్తె డాక్టర్ సునీతారెడ్డితో పాటు ఆయన అభిమానులు ఆశిస్తున్నారు.
Also Read : YS Murder :రాజకోట రహస్యంపై షర్మిల కామెంట్స్, మళ్లీ పాదయాత్రకు రెడీ!
విచారణ ముగిసిన తరువాత అవినాష్ రెడ్డి(Avinash Reddy) మీడియాతో చేసిన వ్యాఖ్యలు హత్య కేసు విచారణను మరిన్ని కోణాల్లోకి తీసుకెళ్లాలా కనిపిస్తోంది. హత్య జరిగిన రోజున అక్కడున్న లేఖను బయట పెట్టాలని ఆయన కోరుతున్నారు. అంతేకాదు, ఈ హత్య వెనుక ఉన్న కొన్ని నిజాలను రాతపూర్వకంగా సీబీఐకి విచారణ సందర్భంగా అందచేశానని వెల్లడించారు. ఆ లేఖలోని ప్రధాన అంశాల్లో హత్య జరిగిన రోజు అక్కడున్న లేఖ గురించి ప్రస్తావించారు. మిగిలిన అంశాలను ఆయన వెల్లడించలేదు. ఎలాంటి అంశాలను సీబీఐకి రాతపూర్వకంగా అనివాష్ రెడ్డి అందచేశారు? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
Also Read : Viveka Murder : మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ..?
వాస్తవంగా వివేక హత్యకు(YS Murder) రెండు రోజుల ముందు ఆయన పెంపుడు కుక్కను కొందరు చంపారు. అంటే, ప్రీ ప్లాన్డ్ గా ఆ హత్య జరిగిందని భావించడానికి పెద్ద సాక్ష్యం అదే. ఆ కుక్కను ఎవరు చంపారు? అనే కోణం నుంచి హత్య కేసు విచారణ ప్రారంభిస్తే నిజాలు వెలుగు చూసే అవకాశం ఉంది. ప్రస్తుతం నిందితులుగా ఉన్న గంగిరెడ్డి, సునీల్ యాదవ్, దస్తగిరి తదితరలు ఆ కుక్కకు కొత్త కాదు. దాని వలన వాళ్లకు ఎలాంటి ప్రతిఘటన ఎదురుకాదు. అలాంటప్పుడు ఎందుకు రెండు రోజుల ముందుగా దాన్ని చంపేశారు? అనేది విచారణాధికారుల పెద్ద సందేహం. ఇక రూ. 40కోట్ల డీల్ కు అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే, ప్రస్తుతం నిందితులుగా పేర్కొంటోన్న వాళ్లకు రక్తపు మరకలు కొత్తకాదు. ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న వాళ్లే, అలాంటి వాళ్లు ఇతరులకు రూ. 40కోట్ల డీల్ ఇచ్చే అవకాశం తక్కువ. పైగా రూ. 40కోట్లు సమకూర్చే స్తోమత కూడా నిందితులకు లేదు.
హత్య కేసు సూత్రధారులు, పాత్రధారులు బయటకు వచ్చే అవకాశం
హత్య (YS Murder) వెనుక తెలియని అదృశ్య శక్తి ఏదో ఉంది? దాన్ని బయటకు తీసుకురావడానికి కుక్కను చంపిన రోజు నుంచి మొదలు పెట్టాలి. ఆ రోజున హత్య జరిగిన ప్రాంతానికి వెళ్లిన పోలీసులు ఎందుకు క్లూ లను సేకరించలేదు? ఆధారాలు లేకుండా చేస్తుంటే అక్కడికి వెళ్లిన సీఐ, ఎస్సై ఏమి చేస్తున్నారు? వాళ్లను ఎందుకు బాధ్యులుగా సీబీఐ భావించడంలేదు? గొడ్డలి పోటు కారణంగా పడిన గాయాలను పూడ్చేందుకు గంగిరెడ్డి ప్రయత్నించారు. అంటే, అప్పటి వరకు వివేకానందరెడ్డి బతికే ఉన్నారా? ఇలాంటి ఎన్నో సందేహాలకు ఈ హత్య తావిస్తోంది. ఆ రోజున హత్య జరిగిన ప్రదేశంలో ఉన్న అసలు లేఖ ఎక్కడుంది? దాన్ని ఎందుకు సీబీఐ బయటకు తీయలేకపోతుంది? ఇలాంటి సందేహాలకు తోడుగా ఇప్పుడు అవినాష్ రెడ్డి(Avinash Reddy) కొంత సమాచారాన్ని సీబీఐకి ఇచ్చారు. వీటన్నింటినీ క్రోడీకరించిన తరువాత హత్య కేసు సూత్రధారులు, పాత్రధారులు బయటకు వచ్చే అవకాశం ఉంది.
సీబీఐ వేసిన కౌంటర్ పిటిషన్లో మాత్రం అవినాష్ రెడ్డిని హత్య సూత్రధారి(Avinash Reddy)
సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ సందర్భంగా సీబీఐ వేసిన కౌంటర్ పిటిషన్లో మాత్రం అవినాష్ రెడ్డిని(Avinash Reddy) హత్య సూత్రధారిగా సీబీఐ పేర్కొంది. అందుకు సంబంధించిన ఆధారాలను కొన్నింటినీ కోర్టుకు అందచేసింది. ఆయన మొబైల్ కాల్ డేటా ద్వారా మొత్తం ఆధారాలను సేకరించిన సీబీఐ తాజాగా గుగూల్ టేక్ ఔట్ ద్వారా మరింత సమాచారాన్ని రాబట్టింది. ఇంకా కొన్ని ఆధారాలను క్రోడీకరించడానికి భాస్కర్ రెడ్డిని. విచారిస్తోంది. మరోసారి అవినాష్ రెడ్డిని విచారణకు సీబీఐ పిలిచే అవకాశం ఉంది. ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని సర్వత్రా వినిపిస్తోంది.
Viveka Murder : హత్య కుట్రదారుడు జగన్ బద్రర్ వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ ?