Jagan : 45 రోజుల పాలనలో 36 రాజకీయ హత్యలు..ఢిల్లీలో ధర్నా చేస్తా: జగన్‌

తీవ్ర విషాదంలో ఉన్న రషీద్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. హత్య ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు.

  • Written By:
  • Publish Date - July 19, 2024 / 07:17 PM IST

Jagan: పల్నాడు జిల్లా వినుకొండలో తాజాగా రషీద్‌ అనే యువకుడు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రషీద్‌ ఇంటికి వైఎస్‌ఆర్‌సిపి అధినేత, ఏపి మాజీ సీఎం జగన్‌ వెళ్లారు. తీవ్ర విషాదంలో ఉన్న రషీద్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. హత్య ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. రషీద్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. హత్య చేసేటంత ఫ్యాక్షన్ కక్షలు కూడా లేవని, మరి ఈ ఘటన ఎలా జరిగింది? అని రషీద్ కుటుంబ సభ్యులను ఆరా తీశారు. మీరన్నా, వైఎస్‌ఆర్‌సిపికి అన్నా రషీద్ కు ఎంతో అభిమానం అని తల్లిదండ్రులు జగన్ కు వివరించారు. ఈ హత్య వెనుక ఎవరు ఉన్నా వదిలేది లేదని, రషీద్ కుటుంబానికి అండగా ఉంటామని ఈ సందర్భంగా జగన్ హామీ ఇచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

అనంతరం జగన్‌ మీడియాతో మాట్లాడుతూ..45 రోజుల కూటమి పాలనలో 36 రాజకీయ హత్యలు జరిగాయి. 300కి పైగా హత్యాయత్నాలు జరిగాయి. ఇళ్లలోకి చొరబడి ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడులకు నిరసనగా ఈనెల 24న బుధవారం రోజు ఢిల్లీలో ధర్నా చేస్తానని ప్రకటించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలపై ప్రధాని మోడీని కూడా కలుస్తామని జగన్‌ అన్నారు. ఏపిలో కూటమి అధికారంలోకి వచ్చినప్పటినుండి అరాచక పాలన కోనసాగుతుందని ఆరోపించారు. హత్యలు, అరాచకాలు పెరిగిపోయాయన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆటవిక పాలన కొనగుతుందని ఆయన మండిపడ్డారు. వైఎస్‌ఆర్‌సిపి సానుభూతి పరులపై దాడులు పెరుగుతున్నాయి. టీడీపీ వాళ్లు ఏం చేసినా పోలీసులు ప్రేక్షకుల పాత్ర వహిస్తున్నారు. బాధితులపైనే తిరిగి కేసులు పెడుతున్న నీచ సంస్కృతి మన రాష్ట్రంలో నెలకొంది అని జగన్‌ విమర్శలు గుప్పించారు. తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చారని, ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు. కాగా, జగన్ రాకతో వినుకొండలో రషీద్ ఇంటి వద్ద భారీగా కోలాహలం నెలకొంది.

Read Also: Pushpa 2 : పుష్ప 2 గొడవలకు ఫుల్ స్టాప్.. పుష్ప షూట్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత..

 

 

 

 

 

 

Follow us