Site icon HashtagU Telugu

YS Jagan: రాష్ట్రంలో ఎప్పుడూ చూడని రాక్షస రాజ్యం నడుస్తోంది: వైఎస్‌ జగన్‌

ys jagan press meet about tirumala tour cancelled

ys jagan press meet about tirumala tour cancelled

YS Jagan Press Meet: వైఎస్‌ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ తిరుమల పర్యటనను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆయన తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు 100 రోజుల పాలన ఫెయిల్యూర్ ని డైవర్ట్ కోసమే లడ్డు వ్యవహరం తెరపైకి తీసుకొచ్చారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎప్పుడూ చూడని రాక్షస రాజ్యం నడుస్తోంది. రాజకీయ దుర్బుద్దితో జంతువుల కొవ్వుతో లడ్లూ తయారైనట్టుగా.. జరగని విషయాన్ని జరిగినట్టుగా.. కల్తీ ప్రసాదంను భక్తులు తిన్నట్టుగా నిజంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి అబద్దాలు ఆడుతూ.. అసత్యాలు చెబుతున్నారు.

Read Also: Kohli Funny Video: కోహ్లీ నుంచి మరో ఫన్నీ వీడియో

తిరుమలలో వేలాది మంది పోలీసులు మోహరించారు. అడ్డగోలుగా చంద్రబాబు ఆలయ పవిత్రను దెబ్బ తీస్తున్నారు. 6నెలలకొకసారి టెండర్లు జరుగుతాయి. టీటీడీ బోర్డు టెండర్లు అప్రూవుల్ చేస్తోంది. టీటీడీ బోర్డు ప్రసిద్ధిగాంచినది. దేశం మొత్తం నుంచి సభ్యత్వం ఉంటుంది. బోర్డు సభ్యత్వం కోసం కేంద్ర మంత్రులు, చుట్టూ ప్రక్కల రాష్ట్రాల ముఖ్యమంత్రులు రికమండ్ చేస్తారు. క్వాలిటీ ఏదైనా అనుమానం వస్తే వాటిని రిజెక్ట్ చేస్తారు. గతంలో చంద్రబాబు హయాంలో 15సార్లు రిజెక్ట్ చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కూడా రిజెక్ట్ చేశారని గుర్తు చేశారు.

వాస్తవానికి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత జూన్ 12 నుంచి నెయ్యిని సరఫరా చేయడం ప్రారంభించారు. జంతువుల కొవ్వును వాడారని.. అన్నీ తెలిసిన వ్యక్తి అబద్దాలు ఆడటం దారుణం అన్నారు. నెయ్యిని వాడలేదని తెలుస్తున్నా.. చంద్రబాబు రెండు నెలల తరువాత ఎందుకు అన్నాడు. జులై 06, 12 తేదీలలో వచ్చిన రెండు ట్యాంకర్లను రిజెక్ట్ చేయడం జరిగిందని ఈవో చెప్పారు.

Read Also: Kiraak RP : భార్య కు విడాకులు ఇచ్చిన కిరాక్ ఆర్పీ..కారణం అదేనా..?

అయితే సెప్టెంబర్ 19న టీడీపీ కార్యాలయం నుంచి NDDB ఎలా రిలీజ్ చేస్తారు అని ప్రశ్నించారు. ట్యాంకర్లలో వచ్చిన నెయ్యిని వాడలేదని.. వెనక్కి పంపించామని చెప్పడంతో పాటు సెప్టెంబర్ 22న ఈవో తాను సంతకం చేసి ప్రభుత్వానికి రిపోర్టు ఇచ్చాడు. రిపోర్టు ఇచ్చిన తరువాత కూడా చంద్రబాబు ట్యాంకర్లు వచ్చేశాయి.. దానిని వాడేశారు. కేవలం రాజకీయంగా లబ్ది పొందేందుకు ఈ మాదిరిగా స్వామి ప్రసాదం విశిష్టతను, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను, ప్రసాదానికి సంబంధించిన పేరు ప్రఖ్యాతలను తగ్గించడం అపవిత్రత కాదా అని ప్రశ్నించారు. జరగనిది జరిగినట్టుగా అబద్దాన్ని ప్రచారం చేయడం ధర్మమేనా..? అని అడిగారు జగన్.

Read Also: CM Revanth Reddy : భద్రకాళీ శరన్నవరాత్రి ఉత్సవాలకు సీఎం రేవంత్‌ రెడ్డికి ఆహ్వానం