ఏపీ సీఎం జగన్ (AP CM Jagan) స్పీచ్ అంటే ముందుగా ఖంగారుపడేది వైసీపీ వారే..దేన్నీ..ఏం అంటారో..ఏంపలుకుతాడో..జనాలు వేసే మీమ్స్ (Memes) ఏ రేంజ్ లో ఉంటాయో అని ప్రతిసారి ఖంగారు పడుతుంటూ..జగన్ స్పీచ్ అయిపోయేవరకు టెన్షన్ తో వింటుంటారు..కానీ జగన్ ప్రతిసారి తనకు వచ్చి రాని తెలుగుతో..తెలుగు భాషను కుని చేస్తుంటారు. గతంలో ఎన్నో సభల్లో జగన్ స్పీచ్ లో అనేక తప్పులు దొర్లగా తాజాగా మరోసారి అదే తప్పు చేసారు.
ఏకంగా ఉల్లిపాయను కాస్త ఆలుగడ్డ (Potato & Onion) గా మార్చి..నవ్వులపాలయ్యాడు. ప్రస్తుతం జగన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా లో వైరల్ అవుతూ మీమ్స్ హల్చల్ చేస్తున్నాయి. ఉల్లి పాయ కు ఆలుగడ్డ కు తేడాలేదా జగన్..ఏంటి మా ఆంధ్రప్రదేశ్ కు ఈ కర్మ అంటూ ఓ రేంజ్ లో ఆడేసుకుంటుంటారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇటీవల సంభవించిన తూఫాన్ ఏపీని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ఈ తూఫాన్ వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికి వచ్చిన పంట నీటిపాలైందని గగ్గోలు పెడుతూ..ప్రభుత్వమే తమను ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో సీఎం జగన్ నేడు తిరుపతి జిల్లా వాకాడు మండలంలో పర్యటించారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రేషన్ వివరాలు వెల్లడిస్తూ కేజి ఆనియన్, కేజి ఉల్లిగడ్డ అని జగన్ వ్యాఖ్యానించారు. పొటాటోని ఉల్లిగడ్డే అంటారుగా అంటూ అధికారులను సీఎం ప్రశ్నించారు. సీఎంకు ఏమంటారో తెలియకపోవడంతో బంగాళదుంప అంటారంటూ అక్కడికి వచ్చిన జనం చెప్పారు. చివరకు అధికారులను పోటాటోను ఏమంటారు అని అడిగి బంగాళ…దుంప… అంటూ పొడిపొడిగా జగన్ చెప్పారు. దీంతో ఆలుగడ్డకు, ఉల్లిగడ్డకు తేడా తెలియని సీఎం అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు ప్రారంభమయ్యాయి. ఇదే కాదు గతంలో చాల పెద్ద తప్పిదాలే జరిగాయి. అందుకే ప్రతిపక్ష పార్టీలు నిత్యం జగన్ తెలుగు ఫై సెటైర్లు వేస్తుంటారు.
Read Also : KCR Health Condition : కేసీఆర్ త్వరగా కోలుకోవాలని పవన్ కళ్యాణ్ ట్వీట్