Ys Jagan Visit Vijayawada: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఏపీ అస్తవ్యస్తంగా మారింది. విజయవాడ ప్రాంతంలో భారీ వరద ఉదృతి కారణంగా ప్రాణనష్టం, ఆస్తి నష్టం వాటిల్లింది. రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. రోడ్లు ధ్వంసమయ్యాయి. మునుపెన్నడూ లేని విధంగా ఏపీలో వర్షలు పడటంతో సినీ, రాజకీయ, వ్యాపార సంస్థలు బాధితులకు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. వైసీపీ తరుపున వైఎస్ జగన్ కోటి రూపాయల విరాళం ప్రకటించారు. ఈ రోజు జగన్ విజయవాడలో పర్యటించనున్నారు.
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. విజయవాడలో ప్రస్తుత పరిస్థితిని తెలుసుకున్న జగన్, ఆందోళనను వ్యక్తం చేశారు. అంతకుముందు వైఎస్ జగన్ సింగ్ నగర్ వరద ఉదృతి గురించి జగన్ అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. జగన్ పర్యటన సందర్భంగా విజయవాడలోని వరద బాధితులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Ys Jagan
ఏపీలో జరిగిన విధ్వంసంపై సీఎం చంద్రబాబు నిత్యం అధికారులతో మాట్లాడుతున్నారు. కలెక్టర్లతో రివ్యూలు నిర్వహిస్తున్నారు. బాధిత ప్రాంతాలకు తక్షణమే అంబులెన్స్‌లు, నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంచాలని చంద్రబాబు ఆదేశించారు. మంత్రులు, జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో వరదల కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రతి కుటుంబాన్ని ఆదుకునే లక్ష్యంతో సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని చెప్పారు. విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారిని గుర్తించి, వారి మృతదేహాలను వారి కుటుంబాలకు తిరిగి ఇచ్చేలా చూడాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కుటుంబాలు ఆచూకీ లేని సందర్భాల్లో ప్రభుత్వం అత్యంత గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహిస్తుందని హామీ ఇచ్చారు.
Also Read: GOAT Release : ఉద్యోగులకు హాలిడే ఇచ్చిన కంపెనీ..!!