Amaravathi : అమ‌రావ‌తి క్లోజ్!జ‌‌గ‌న్ మాస్ట‌ర్ ప్లాన్ ఇదే!!

విశాఖ రాజ‌ధాని చూట్టూ జ‌గ‌న్ మ‌న‌సు తిరుగుతోంది. అక్క‌డి నుంచి ప‌రిపాల‌న చేయ‌డానికి మార్గాల‌ను అన్వేషిస్తున్నాడు. న్యాయ‌స్థానాల నుంచి త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు.

  • Written By:
  • Publish Date - November 22, 2021 / 04:36 PM IST

విశాఖ రాజ‌ధాని చూట్టూ జ‌గ‌న్ మ‌న‌సు తిరుగుతోంది. అక్క‌డి నుంచి ప‌రిపాల‌న చేయ‌డానికి మార్గాల‌ను అన్వేషిస్తున్నాడు. న్యాయ‌స్థానాల నుంచి త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. మూడు రాజ‌ధానుల ల‌క్ష్యాన్ని చేరుకోవ‌డానికి అధ్య‌య‌నం సాగిస్తున్నాడు. అభివృద్ధితో పాటు అధికార వికేంద్రీక‌ర‌ణ దిశ‌గా ఈసారి స‌మ‌గ్ర బిల్లు పెట్ట‌డానికి సిద్ధం అవుతున్నాడు. అమ‌రావ‌తిని నామ‌మాత్రం చేయ‌డానికి ఏ మాత్రం వెనుక‌డుగు వేయ‌డంలేదు. విశాఖ‌ను దేశంలోని ఇత‌ర సిటీల జాబితాలోకి తీసుకెళ్ల‌డానికి మాస్ట‌ర్ ప్లాన్ వేస్తున్నాడు జ‌గ‌న్‌.

Also Read :  అమ‌రావ‌తిపై `షా` మార్క్

ప్రాంతీయ మండ‌ళ్ల‌ను ఏర్పాటు చేయాల‌ని చాలా కాలంగా వైసీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. నాలుగు ప్రాంతీయ మండ‌ళ్ల‌ను ఏర్పాటు చేయ‌డం ద్వారా అభివృద్ధితో పాటు అధికార వికేంద్రీక‌ర‌ణ సాధ్య‌మ‌ని జ‌గ‌న్ భావిస్తున్నాడు. రాష్ట్రంలోని ఉత్త‌రాంధ్ర‌ను ఒక మండ‌లిగా, రాయ‌సీమ‌ను మ‌రో మండ‌లిగా, మ‌ధ్య కోస్తాను ఇంకో మండ‌లిగానూ, గోదావ‌రి, కృష్ణా జిల్లాను ఒక మండ‌లిగానీ పెట్టాల‌ని యోచిస్తున్నాడని తెలిసింది. ఆ నాలుగు మండ‌ళ్ల‌కు న‌లుగురు చైర్మ‌న్ల‌తో పాటు అధికార యంత్రాంగం స‌చివాల‌యంలో మాదిరిగా ఉంటుంది. క‌మిష‌న‌రేట్ ల‌తో పాటు అన్ని ర‌కాల ఆఫీస్ లు కూడా ఆ మండ‌లి కార్యాల‌యంలోనే ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు.
నాలుగు మండ‌ళ్ల‌ను విశాఖ ప‌రిపాల‌న రాజ‌ధానికి అనుసంధానం చేయ‌డం ద్వారా అధికార వికేంద్రీక‌ర‌ణ చేయాల‌ని జ‌గ‌న్ మాస్ట‌ర్ ప్లాన్ వేశాడ‌ని తెలుస్తోంది. ఏ ప్రాంతానికి సంబంధించిన స‌మ‌స్య‌లు ఆ ప్రాంతంలోని మండ‌లిలోనే ప‌రిష్క‌రించుకునేలా ప్ర‌ణాళిక సిద్ధం అవుతోంది. విశాఖ ప‌రిపాల‌న కేంద్రానికి ఎవ‌రూ రాకుండా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేలా ఆన్ లైన్ విధానం తీసుకురాబోతుంది జ‌గ‌న్ స‌ర్కార్‌. వినూత్నంగా ప‌రిపాల‌న సాగించాల‌ని ఆ మేర‌కు ప్రాంతీయ మండ‌ళ్ల‌ను ఏర్పాటు చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాడ‌ని తెలిసింది.

Also Read : మోడీ, యోగి హాట్ ఫోటో లోగుట్టు

ఆంధ్రప్ర‌దేశ్‌లోని ఆయా ప్రాంతాల భౌగోళిక‌, సామాజిక‌, ఆర్థిక , వ‌ర్గ సమీక‌ర‌ణ‌లు వేర్వేరుగా ఉంటాయి. అన్నింటినీ స‌మ‌న్వ‌యం చేసుకుంటూ ప‌రిపాల‌న సాగించడానికి జ‌గ‌న్ సిద్ధం అవుతున్నాడు. అందుకే, ప్రాంతీయ మండ‌ళ్ల ద్వారా అస‌మాన‌త‌లు రాకుండా చేయాల‌ని భావిస్తున్నారు. భవిష్య‌త్ లో ప్రాంతీయ ఉద్య‌మాల‌కు అవ‌కాశంలేకుండా ప్రాంతీయ మండ‌ళ్ల రూప‌క‌ల్ప‌న జ‌రుగుతోంది.
త్వ‌ర‌లోనే స‌మ‌గ్ర బిల్లు ప్రాంతీయ మండ‌ళ్ల‌కు సంబంధించి అసెంబ్లీ ముందుకు రాబోతుంది. అదే జ‌రిగితే, అమ‌రావ‌తి కేవ‌లం అసెంబ్లీ స‌మావేశాల‌కు మాత్ర‌మే ప‌రిమితం కానుంది.