YS Jagan Mass Ragging On Chandrababu : చంద్రబాబుపై జగన్ సెటైర్లు.. హావభావాలు వైరల్

YS Jagan Mass Ragging On Chandrababu : 'నీకు రూ.15వేలు.. మీ తమ్ముడికి రూ.15 వేలు.. సంతోషమా' అని ఇమిటేట్ చేశారు. దీంతో అక్కడున్న వారంతా నవ్వుకున్నారు.

Published By: HashtagU Telugu Desk
Jagan Mass Ragging

Jagan Mass Ragging

YS Jagan Mass Ragging On Chandrababu : ఏపీ మాజీ సీఎం , వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి (Jagan)..శుక్రవారం పిఠాపురం (Pithapuram ) వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్బంగా వరద బాధితులతో మాట్లాడి..నష్టాలపై అరా తీశారు. అనంతరం మీడియా తో మాట్లాడుతూ చంద్రబాబు పై ఆగ్రహం వ్యక్తం చేసారు.

చంద్రబాబు (Chandrababu ) నిర్లక్ష్యంతో విజయవాడకు వరదలు (Floods to Vijayawada)

రాష్ట్రంలో ఫ్లడ్‌ మేనేజ్‌మెంట్‌లో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైంద‌ని మండిప‌డ్డారు. ప్రజలను ఇబ్బంది పెట్ట‌డ‌మే కాకుండా చంద్రబాబు నిత్యం తనపై విమర్శలు చేస్తున్నారు. అధికారంలో వచ్చి ఇన్నిరోజులు గడిచినా.. తాను చేయాల్సిన పనులేవీ చేయలేదు. దానంతటికి కారణం జగనే అని అంటున్నారు. ఎక్కడ ఏం జరిగినా.. తన పేరే చెప్తారని దుయ్య‌బ‌ట్టారు. ప్రజలకు న్యాయంగా, ధర్మంగా ఇవ్వాల్సిన దాని మీద ధ్యాస పెట్టాల‌ని జ‌గ‌న్‌ సూచించారు. చంద్రబాబు నిర్లక్ష్యంతో విజయవాడకు ఎలాగైతే వరదలు వచ్చాయో అదేలాగా ఏలేరు రిజర్వాయర్‌ రైతులను ముంచేసిందని జగన్‌ పేర్కొన్నారు. ముందస్తు హెచ్చరికలు ఉన్నా పట్టించుకోలేదని, అధికారులను, ప్రజలను అప్రమత్తం చేయడంలో విఫలమైందని మండిపడ్డారు. ఏలేరు రిజర్వాయర్ వాటర్ మేనేజ్మెంట్లో నిర్లిప్తత కనిపించిందన్నారు. కనీసం కలెక్టర్లతో రివ్యూ చేయలేదని దుయ్య బట్టారు.

చంద్రబాబు డ్రామా ఆర్టిస్ట్ (Chandrababu Drama Artist)

కూటమి సర్కార్ ..వరద బాధితులను ఆదుకోకుండా ఫొటోలకే పరిమితమైందని జగన్ విమర్శించారు. చంద్రబాబు డ్రామా ఆర్టిస్ట్ అయిపోయాడు. మామూలుగా పవన్ కళ్యాణ్ సినిమా స్టార్.. కానీ ఇక్కడ కాదు. పాపం ఆయన కొత్తగా వచ్చాడు కాబట్టి ఏమీ తెలియదు. కానీ చంద్రబాబు పవన్ను మించిపోయాడు. ఆయన సినిమా ఆర్టిస్ట్ అయితే ఈయన డ్రామా ఆర్టిస్ట్’ అని విమర్శించారు. ఇదే సందర్బంలో చంద్రబాబుపై సెటైర్లు వేస్తూ జగన్ మాట్లాడిన తీరు, హావభావాలు ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. ఎన్నికల సమయంలో నగదు స్కీమ్ల ప్రకటిస్తూ చంద్రబాబు మాట్లాడిన మాటలను జగన్ అనుకరించారు. ‘నీకు రూ.15వేలు.. మీ తమ్ముడికి రూ.15 వేలు.. సంతోషమా’ అని ఇమిటేట్ చేశారు. దీంతో అక్కడున్న వారంతా నవ్వుకున్నారు.

Read Also : Junior Doctors : హత్యాచార ఘటన..రాష్ట్రపతి, ప్రధానికి జూనియర్‌ డాక్టర్లల లేఖ

  Last Updated: 13 Sep 2024, 07:38 PM IST