Jagan : అసెంబ్లీలో తనను అవమానించారంటూ స్పీకర్‌కు జగన్ లేఖ..

మంత్రులు తర్వాత నాతో ప్రమాణ స్వీకారం చేయించడం నిబంధనలకు విరుద్ధమని లేఖలో జగన్ పేర్కొన్నారు

Published By: HashtagU Telugu Desk
Jagan Letter To

Jagan Letter To

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy)..తాజాగా అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి లేఖ రాసారు. మంత్రులు తర్వాత నాతో ప్రమాణ స్వీకారం చేయించడం నిబంధనలకు విరుద్ధమని లేఖలో జగన్ పేర్కొన్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని ముందే నిర్ణయించుకున్నట్టున్నారు. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అసెంబ్లీ రూల్స్ లో నిర్వచించారు.

We’re now on WhatsApp. Click to Join.

ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటే 10శాతం సీట్లు వుండాలని ఎక్కడా లేదు. పార్లమెంట్, ఉమ్మడి ఏపీలో ఈ నిబంధనలు పాటించలేదని లేఖలో పేర్కొన్నారు. కూటమి, స్పీకర్ తనపై శత్రుత్వం ప్రదర్శిస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితులు కనిపించడం లేదన్నారు. ప్రతిపక్ష హోదాతోనే సమస్యలు వినిపించే అవకాశం ఉందన్నారు. ఈ అంశాలను స్పీకర్ దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు.

Read Also : NEET Paper Leak Case: నీట్‌ పేపర్‌ లీక్‌ కేసులో సంచలనం: సైబర్ నేరగాళ్ల హస్తం

  Last Updated: 25 Jun 2024, 04:43 PM IST