YS Jagan; దారుణ హత్యకు గురైన యువకుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ వినుకొండకు వెళ్లారు. పార్టీ నేతలతో కలిసి ఆయన తన కాన్వాయ్‌లో వినుకొండకు బయలుదేరారు. మృతుల కుటుంబాలను పరామర్శించి ఆదుకుంటామన్నారు. వినుకొండలో ప్రస్తుతం 144 సెక్షన్ అమలులో ఉంది. ర్యాలీలు మరియు ప్రదర్శనలను నిషేధించారు. ర్యాలీలకు అనుమతి లేదని పల్నాడు ఎస్పీ ప్రకటించారు. కాగా హత్యకు గురైన రషీద్ కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ కలుసుకుని పరామర్శించనున్నారు.
అంతకుముందు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jagan) వినుకొండకు వెళ్తున్న ఆయన కాన్వాయ్‌పై పోలీసులు ఆంక్షలు విధించారు. ఆయన వెంట వస్తున్న పార్టీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. జగన్ వెంట వెళ్లేందుకు సిద్ధమైన మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలను కాన్వాయ్‌లోకి రానీయకుండా అడ్డుకున్నారు. పోలీసులు వాహనాల రాకపోకలను నియంత్రిస్తూ, మాజీ ముఖ్యమంత్రిని ఏ పార్టీ నాయకుల కార్లు అనుసరించకుండా చూసుకుంటున్నారు.
జగన్ కాన్వాయ్‌ని పోలీసులు అడ్డుకోవడంతో తాడేపల్లి, మంగళగిరి, గుంటూరులో పరిస్థితి ఉధృతమైంది. గతంలో జగన్ భద్రత కోసం ఉపయోగించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా తొలగించారు. అందులో ఏవో మెకానికల్ సమస్యలు ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు. దీంతో జగన్ ఇప్పుడు ప్రైవేట్ వాహనంలో వినుకొండకు వెళ్తున్నారు. దీంతో పోలీసుల తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
నిన్న వైసీపీలో గ్యాంగ్ వార్ జరిగింది. రాత్రి వినుకొండలో నడి రోడ్డుపై రషీద్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. షేక్ జిలానీ అనే వ్యక్తి ఈ హత్య చేశాడు.
Also Read: Whatsapp Update: వాట్సాప్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. ఆ ఫీచర్ తో ఇప్పుడు మరింత సులభం!
